ఆంధ్ర ప్రదేశ్

మళ్లీ రెచ్చిపోయిన రోజా… జగన్ గెలిస్తే ఒక్కొక్క నా కొడుకు అమెరికా పారిపోతారు?

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకి కూడా వేడెక్కుతున్నాయి. వైసీపీ మాజీ మంత్రి రోజా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతిపక్ష పార్టీ నాయకులపై తీవ్రంగా మండిపడుతుంది. ఎమ్మెల్యే, మంత్రి లేదా ముఖ్యమంత్రి అని తేడా లేకుండా తీవ్రంగా ఫైర్ అవుతుంది. తాజాగా కూటమి ప్రభుత్వం నాయకులపై మాజీ మంత్రి రోజా తీవ్రంగా మండిపడింది. రాష్ట్రంలో గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయారని రోజా ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నేతలు తెలంగాణ రాష్ట్రానికి పారిపోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
శ్రీశైలంలో మళ్లీ మోగిన ‘సైరన్’… ఏ క్షణమైనా గేట్లు ఎత్తొచ్చు?
రేపొద్దున జగనన్న ప్రభుత్వం రావడం ఖాయమని… ఒక్కసారి మేము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి కూడా 100 రెట్లు వడ్డీతో సహా చెల్లిస్తామని మాజీ మంత్రి రోజా హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ అమెరికా పారిపోతారని చెప్పుకొచ్చారు. ఈమధ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బాగా పిచ్చి ముదిరింది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఏ ప్రాంతానికి వెళ్ళినా లేదా ఈ రాష్ట్రానికి వెళ్లిన కూడా అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను అంటుంటాడు అని వైసీపీ మాజీ మంత్రి రోజా చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు. కాగా ఈమధ్య రోజాకు అలాగే ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య చాలానే వాగ్వాదాలు జరుగుతూ ఉన్నాయి. మరి రోజా నేడు చేసిన వ్యాఖ్యలు ఎలాంటి గొడవలకు దారితీస్తాయో వేచి చూడాల్సిందే!..

పవన్ కళ్యాణ్ సినిమా సూపర్ హిట్ కావాలని అలిపిరి మెట్ల వద్ద కొబ్బరికాయ కొట్టిన జనసేన ఎమ్మెల్యే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button