
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఏపీ హోం మంత్రి అనిత పై వైసీపీ నేత రోజా తీవ్రంగా పైరయ్యారు. తాజాగా హోంమంత్రి అనిత గత వైసీపీ ప్రభుత్వం వల్లే వైద్య కళాశాలలో ఇటువంటి దారుణమైన దుస్థితి ఏర్పడింది అని వ్యాఖ్యానించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. గత వైసీపీ ఐదేళ్ల ప్రభుత్వ కాలంలో వైద్య కళాశాలలో ఒక్క అడ్మిషన్ కూడా ఇవ్వలేకపోయామని హోంమంత్రి అనిత అన్నారు. అంతేకాకుండా మెడికల్ కాలేజీల భవనాలలో కేవలం 47% మాత్రమే పనులు జరిగాయని అన్నారు. ల్యాబ్స్, లైబ్రరీ అలాగే ఫ్యాకల్టీ కూడా లేదని అడ్మిషన్ ఇవ్వలేమని నేషనల్ మెడికల్ కౌన్సిల్ రిపోర్టు ఇచ్చిందని… ఇది మీరు చేసిన తప్పిదం వల్లే కదా అని అనిత మండిపడ్డారు. మెడికల్ కాలేజీలకు ఇవ్వాల్సినటువంటి సొమ్మును వేరే వాటికి ఉపయోగించుకున్నారు అని వైసీపీ ప్రభుత్వం పై హోం మంత్రి అనిత తీవ్ర ఆరోపణలు చేశారు.
Read also : అనుమానస్పద స్థితి లో 2వ తరగతి విద్యార్ధి మృతి
అయితే నేడు మాజీ మంత్రి రోజా హోం మంత్రి అనిత వ్యాఖ్యలపై స్పందిస్తూ తీవ్రంగా పైరయ్యారు. మీకు దమ్ముంటే రాజమండ్రి, నంద్యాల, మచిలీపట్నం, పాడేరు అలాగే విజయనగరం మెడికల్ కాలేజీలకి రండి… అవి ఎలా ఉన్నాయో ఒకసారి గమనించండి. కాలేజీలు ఎలా కట్టాలో.. అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ ఎవరెవరు నేను చూపిస్తానని రోజా హోమ్ మంత్రికి సెటైర్లు వేశారు. పిచ్చి పిచ్చి వీడియోలు చేసి ఊరికే మాట్లాడకు అసలు నువ్వు యాంకర్ వా?.. మినిస్టర్ వా? అని రోజా… హోంమంత్రిని ఉద్దేశించి మండిపడ్డారు. అసలు జగన్ గురించి మాట్లాడి అర్హత మీకు గాని.. మీ ప్రభుత్వానికి గాని ఉందా?.. అని ప్రశ్నించారు. రోజా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ, ఏపీ రాజకీయాల్లోనూ వైరల్ అవుతున్నాయి.
Read also : సొంత ఖర్చులతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేదోళ్ళ విద్యకు పెద్ద పీఠ