ఆంధ్ర ప్రదేశ్

పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన రోజా… దమ్ముంటే 175 సీట్లలో పోటీ చేయి!

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకి కూడా ఉత్కంఠంగా మారుతున్నాయి. ఇరు పార్టీల వర్గాల నేతలు నిత్యం విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. మన భారతదేశం మొత్తం మీద కూడా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మాత్రం వేరేలా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిరోజు కూడా రాజకీయంగా ఏదో ఒక వార్త హైలైట్ అవుతూనే ఉంటుంది. మరి ముఖ్యంగా వైసీపీ, టీడీపీ మరియు జనసేన పార్టీల మధ్య నిత్యం ఏదో ఒక విమర్శలు అవుతూనే ఉంటాయి. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ, జనసేన అలాగే బిజెపి కలిసి ఎన్నికల్లో పాల్గొని విజేతగా నిలిచారు. ఇప్పుడు ఈ మూడు పార్టీల యొక్క ప్రతిపక్ష పార్టీ ఒక వైసీపీ మాత్రమే. అయితే వైసీపీ పార్టీలోని రోజా, పేర్ని నాని, కొడాలి నాని వంటి నాయకులు కూడా నిత్యం ప్రతిపక్ష పార్టీలపై ఏదో ఒక విమర్శలు చేస్తూనే ఉంటారు. అయితే తాజాగా రోజా పవన్ కళ్యాణ్ పై తీవ్రంగా మండిపడ్డారు.
ఆపరేషన్‌ సిందూర్‌తో సత్తా చాటాం… యాక్సియం-4 మిషన్‌పై మోదీ ప్రశంసలు
పవన్ కళ్యాణ్ కు దమ్ముంటే 175 సీట్లలో పోటీ చేయాలని మాజీ మంత్రి రోజా పవన్ కళ్యాణ్ కు సవాలు విసరడం జరిగింది. కేవలం జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి, మరోవైపు తెలుగుదేశం పార్టీని కాపాడడానికి మాత్రమే పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని రోజా ఆరోపించారు. ప్రస్తుతం ఎక్కడ టీడీపీ ప్రెస్ మీట్ పెట్టిన జనాలు రావట్లేదని తెలిపారు. అలాగే ఎవరూ కూడా టిడిపిని తిడుతూ ప్రెస్ మీట్ పెట్టిన వాళ్లను జనసేన పార్టీ నుంచి తరిమేస్తున్నారని మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని నమ్ముకుని జండాలు మోసిన వారికి పవన్ కళ్యాణ్ ఏం చేశారని?.. ప్రశ్నించారు. అలాగే పవన్ కళ్యాణ్ నమ్ముకున్న సామాజిక వర్గానికి ఏం చేశారని?… ప్రశ్నించారు. “పవన్ కళ్యాణ్ ది హీరోయియిజం కాదని.. దొంగ దెబ్బ తీయడం” అని అంటారని మాజీ మంత్రి రోజా… పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు.

చిరంజీవి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సినిమా ” స్టాలిన్ ” రీ రిలీజ్! ఎప్పుడంటే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button