ఆస్ట్రేలియా గడ్డమీద ఆస్ట్రేలియా మరియు టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మొదటి టెస్టులో టీమిండియా బ్యాట్స్మెన్లు అందరూ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ లో పేలవ ప్రదర్శన కనబరుచుగా రెండో ఇన్నింగ్స్ లో అద్భుత ప్రదర్శనతో మొదటి టెస్ట్ మ్యాచ్ గెలిచారు. ఇక ఈ టెస్ట్ మ్యాచ్ కి రోహిత్ అందుబాటులో లేకపోవడంతో బుమ్రా నే మొదటి టెస్ట్ మ్యాచ్ కి నాయకత్వం వహించాడు.
నారాయణ స్కూల్లో మరో విషాదం!… విద్యార్థి ఆత్మహత్య?
ఇక రెండవ టెస్ట్ మ్యాచ్ కు రోహిత్ అందుబాటులో ఉండడం వల్ల రోహిత్ శర్మనే కెప్టెన్సీ వ్యవహరించాల్సి వచ్చింది. ఇక ఫస్ట్ మ్యాచ్ గెలుపుతో ఆనందంతో మ్యాచ్ ప్రారంభించిన టీమ్ ఇండియా బ్యాట్స్మెన్లు అందరూ కూడా ఒక్కసారిగా తక్కువ పరుగులకే అవుట్ అయిపోయారు. కాబట్టి సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా మీద టీం ఇండియా ఘోరంగా పరాజయం పొందింది. దీంతో టీమ్ ఇండియా క్రికెట్ ఫ్యాన్స్ అందరు కూడా ఆందోళన చెందారు.
స్విగ్గి మరియు జొమాటో డెలివరీ చార్జీలు తగ్గింపు!
ఇక మూడో టెస్ట్ మ్యాచ్ లో కూడా ఓటమి దిశగా ఇండియా వెళుతుంది. ఇక ఈ తరహాలోనె టీం ఇండియా బ్యాట్స్మెన్లు తక్కువ పరుగులకే అవుట్ అవుతున్నారు. ఇక తాజాగా రోహిత్ శర్మ కూడా రెండు టెస్ట్ మ్యాచ్ లలో తక్కువ పరుగులకే అవుట్ అవుతుండడంతో ఇక టెస్ట్ ఫార్మేట్ కు గుడ్ బై చెప్తున్నట్లు అందరూ కూడా అనుకుంటున్నారు. టెస్ట్ ఫార్మేట్ మొత్తానికి రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లుగా వార్త కథనాలు అయితే నెట్టెంటా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.