
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- భారత్ మరియు సౌత్ ఆఫ్రికా మధ్య జరిగినటువంటి మూడో వన్డే మ్యాచ్లో రోహిత్ శర్మ తన జీవితంలోనే ఒక కీలకమైన మైలురాయిని చేరుకొని రికార్డు సృష్టించారు. నిన్నటి రోజున విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ తో రాణించగా అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో 20,000 పరుగులను పూర్తి చేసుకున్నారు. ఇక 20 వేల పరుగులు చేసిన నాలుగవ ఇండియన్ ప్లేయర్ గా రోహిత్ శర్మ అరుదైన రికార్డు సృష్టించాడు. ఇప్పటికే వన్డే మ్యాచ్లలో రోహిత్ శర్మ అత్యధిక సిక్సర్లలో మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక తాజాగా 20 వేల పరుగులు కూడా పూర్తి చేసుకొని ఈ ఏజ్ లో కూడా అత్యద్భుత ప్రదర్శన కనబరుస్తున్నటువంటి రోహిత్ శర్మకు అభిమానులు పెద్ద ఎత్తున ప్రశంసిస్తున్నారు. ఇక 20 వేల పరుగులు పూర్తిచేసిన లిస్టులో మొదటి స్థానంలో సచిన్ టెండూల్కర్ 34,357 పరుగులు తో ఉన్నారు. 27910 పరుగులతో విరాట్ కోహ్లీ రెండవ స్థానంలో ఉండగా, మూడవ స్థానంలో ద్రావిడ్ 24064 పరుగులతో ఉన్నారు. ఇక ఇవ్వాలా విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్లో 20000 పరుగులు పూర్తిచేసుకుని నాలుగోవ ప్లేయర్గా రోహిత్ శర్మ నిలిచారు. వైజాగ్ స్టేడియం లోనే రోహిత్ శర్మ 20000 పరుగులను పూర్తిచేసుకుని.. వన్డే సిరీస్ ని కూడా కైవసం చేసుకుంది. దీంతో ఆంధ్రాలోని క్రికెట్ అభిమానులు అందరూ కూడా మరిన్ని మ్యాచ్లు వైజాగ్ లో నిర్వహిస్తే ప్లేయర్స్ కూడా మరిన్ని రికార్డ్లు సృష్టిస్తారు అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Read also : నీ అబద్ధాల ప్రచారంతో వాస్తవాలు కనుమరుగు కావు : హరీష్ రావు
Read also : Yogi Adityanath: అయోధ్య అయిపోయింది, నెక్ట్స్ టార్గెట్ ఏంటో చెప్పిన యోగీ!





