
నల్లగొండ(క్రైమ్ మిర్రర్):- ఎన్హెచ్ 65 నేషనల్ హైవే పైన గల, కట్టంగూర్ నల్గొండ ఎక్స్ రోడ్డు, కురుమర్తి ఎక్స్ రోడ్డు, నకిరేకల్ నగేష్ హోటల్ సమీపంలో గల బ్లాక్ స్పాట్ వద్ద, అక్కడి చుట్టు పక్కల గ్రామ ప్రజలు సర్వీస్ రోడ్డు లేనందున వ్యతిరేక దిశలో ప్రయాణించడం ద్వారా ప్రమాదాలకు గురి అవుతున్నారనే కారణంతో, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఎన్హెచ్ ఏఐ, చౌదరి కంపెనీ, రాంకుమార్ కన్ స్ట్రక్షన్ అధికారులతో కలిసి సందర్శించి పరిశీలించి ప్రమాదాలు జరగకుండా, ఇరువైపులా సర్వీస్ రొడ్డులు, కురుమర్తి క్రాస్ రోడ్డు నుంచి కట్టంగూర్ అండర్ పాస్ వరకు సర్వీస్ రోడ్డు వేయాలని, అలాగే అన్ని జంక్షన్ ల వద్ద హైమాక్స్ లైట్స్, సెంట్రల్ లైటింగ్, బ్లింకర్స్, జీబ్రా క్రాసింగ్ లైన్స్, రంబుల్ స్టిక్స్ మొదలగు వేగ నియంత్రణ సూచికలు వెంటనే పెట్టే విధంగా అధికారులను ఆయన ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాల నివారణ ప్రమాదాలు ఎక్కువగా జరిగే నేషనల్ హైవే, స్టేట్ హైవేల పైన యాక్సిడెంట్ ఫ్రోన్, బ్లాక్ స్పాట్ ఏరియాలను గుర్తించి, రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రాత్రి సమయంలో రహదారిపై వాహనాలు నిలిపి ఉండడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ, రోడ్డుపై ఎలాంటి వాహనాలు నిలవకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.. (మిషన్ ఆర్ఆర్ఆర్) రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా, హైవే వెంట ఉన్న గ్రామ ప్రజలకు రోడ్డు ప్రమాదాల నివారణ పట్ల అవగాహన కల్పించి, రోడ్డు భద్రత పట్ల చైతన్య పరచాలని పోలీసు అధికారులను ఆయన ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల పైన ఎప్పటికప్పుడు సంబంధిత అధికారుల సమన్వయంతో, ప్రమాదాల నివారణ చర్యలు తీసుకుంటామని, వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, శాలిగౌరారం సిఐ కొండల్ రెడ్డి, కట్టంగూర్ ఎస్ఐ రవీందర్, ఎన్హెచ్ ఏఐ రెసిడెంట్ ఇంజనీర్ కిషన్ రావు, జోగేంద్ర, చౌదరి కంపని ప్రాజక్ట్ మేనేజర్ నాగ కృష్ణ , రాంకుమార్ కన్స్ట్రక్ట్షన్ సంజీవ చౌదరి, డి.టి.ఆర్బి రిటైర్ సీఐ అంజయ్య తదితరులు పాల్గోన్నారు..