క్రైమ్

విజయవాడ హైవేపై రోడ్డుప్రమాదం

  • బైక్‌ను ఢీకొట్టిన కారు, ఒకరికి తీవ్రగాయాలు

  • తెగిపడిన కాలు, ఆస్పత్రిలో చికిత్స

  • కోదాడ శ్రీరంగాపురం వద్ద ఘటన

క్రైమ్ మిర్రర్, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. విజయవాడ హైవేపై రోడ్డు దాటుతున్న బైక్‌ను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనం నడుపుతున్న కర్రి నర్సయ్యకు తీవ్రగాయాలు అయ్యాయి. నర్సయ్య కాలు తెగిపడిపోయింది. అకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదంలో నర్సయ్య తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రజలు రహదారి దాటేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. హైవేపై ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button