
Richest Beggar: ప్రపంచంలోనే అత్యంత ధనిక బిచ్చగాడిగా పేరును సంపాదించిన వ్యక్తి పేరు భరత్ జైన్. ముంబై నగరంలో ఆజాద్ మైదాన్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వంటి జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాల వద్ద ఈయన గత ఇరవై ఐదేళ్లుగా బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సాధారణంగా బిక్షం అడుగుతూ కనిపించే ఈ వ్యక్తి కోట్లాది రూపాయల ఆస్తులను కూడగట్టుకున్నాడు. దేశంలోని పలు రాష్ట్రాల్లో కలిపి ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలకు పైగా విలువ చేసే ఆస్తులు అతని పేరుమీద నమోదై ఉన్నాయన్నది అనేక మందిని ఆశ్చర్యపరుస్తోంది. అంతేకాదు నెలకు లక్షల్లో సంపాదించే వ్యాపారవేత్తలు, మంచి ఉద్యోగాల్లో ఉన్నవారికంటే భరత్ జైన్ ఆదాయం ఎక్కువగా ఉండటం గమనార్హం.
భరత్ జైన్ సంపాదన గురించి మరికొంచెం లోతుగా చూసుకుంటే అతని జీవిత కథలో దాగి ఉన్న కష్టాలు కనులముందు ప్రత్యక్షమవుతాయి. చిన్నతనం నుంచే తీవ్రమైన పేదరికాన్ని ఎదుర్కొన్న ఆయన చదువు కొనసాగించే అవకాశం కోల్పోయాడు. కుటుంబాన్ని పోషించేందుకు మార్గం లేక చివరకు బిక్షాటనే జీవనోపాధిగా ఎంచుకున్నాడు. తరువాత పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాడు. కానీ పరిస్థితులకు లొంగకుండా, తనకు వచ్చిన ప్రతి రూపాయినీ జాగ్రత్తగా దాచుకుని కుటుంబానికి మంచి భవిష్యత్తు అందించాలనే సంకల్పంతో ముందుకు సాగాడు. రోజుకు రూ.2 వేల నుండి రూ.2,500ల వరకు సంపాదించే ఆయన నెలకు మొత్తంగా రూ.60,000 నుంచి రూ.75,000 వరకు సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం అతనికి ఉన్న ఆస్తుల మొత్తం విలువ సుమారు రూ.7,50,00,000లుగా అంచనా వేయబడుతోంది.
ఇక్కడ భరత్ జైన్ జీవితం మరింత ఆసక్తికరంగా మారే అంశం ఉంది. అతను కేవలం బిక్షం ద్వారానే కాకుండా వచ్చిన డబ్బును తెలివిగా పెట్టుబడులుగా పెట్టడం ద్వారా కూడా ఆస్తులు ఏర్పరచుకున్నాడు. తాజాగా అతని పేరుమీద ముంబైలో సుమారు కోటి 40 లక్షల రూపాయల విలువైన రెండు అపార్ట్‌మెంట్లు, అలాగే థానే నగరంలో రెండు దుకాణాలు ఉన్నాయి. వీటిని అద్దెకు ఇచ్చి ప్రతి నెలమాసం మరో రూ.30 వేల వరకు ఆదాయం పొందుతున్నాడు. అంటే అతను సంపాదించిన ప్రతి పైసానూ జాగ్రత్తగా పెట్టుబడిగా మార్చిన తీరు అతని జీవితాన్ని బిక్షగాడి స్థాయి నుండి కోట్లాది ఆస్తుల యజమానిగా తీర్చిదిద్దింది.
ALSO READ: Battai: అమ్మో!.. బత్తాయి జ్యూస్ తాగడం వల్ల ఎన్ని లాభాలో..?





