తెలంగాణ

CM Revanth Reddy : పదేళ్లు నేనే సీఎం.. భట్టి, ఉత్తమ్‍కు రేవంత్ షాక్!

కాంగ్రెస్ లో ఏ నిర్ణయం అయినా హైకమాండే తీసుకుటుంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కొత్త విధానపరమైన నిర్ణయాలుత తీసుకోవాలన్న హైకమాండ్ అనుమతి కావాలి. ముఖ్యమంత్రి, మంత్రి పదవుల్లోనే వాళ్లదే ఫైనల్. అలాంటింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం తానే సుప్రీం అన్నట్లుగా మాట్లాడేశారు. రెండోసారి నేనే ముఖ్యమంత్రి అవుతానని ప్రకటించుకున్నారు.

శాసనమండలి వాయిదా తర్వాత మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.. పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పారు. మొదటిసారి బిఆర్ఎస్ పై వ్యతిరేకతతో కాంగ్రెస్ కు ఓటేశారని చెప్పారు. రెండోసారి మాపై ప్రేమతో ఓటు వేస్తారని అన్నారు.సంక్షేమ పథకాల లబ్ధిదారులే తమ ఓటర్లు అన్నారు. పనిని నమ్ముకుని ముందుకు వెళుతున్నానని..ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని సీఎం రేవంత్ తెలిపారు.

స్టేచర్ కాదు స్టేట్ ఫ్యూచర్ తనకు ముఖ్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 25 లక్షల పైచిలుకు రుణమాఫీ జరిగిందన్నారు. ఒక్క కుటుంబంలో నలుగురు ఉన్నా.. రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య కోటి దాటుతుందని తెలిపారు. కోటిమంది మహిళలకు కచ్చితంగా లబ్ధి చేకూరుస్తానని ప్రకటించారు. వారంతా ఇప్పుడు మాట్లాడకపోయినా ఓటు తనకే వేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.గతంలో నేను చెప్పిందే జరిగింది.. భవిష్యత్తులోనూ తాను చెప్పిందే జరుగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

అదుపులో పెట్టుకో.. పవన్‌కు హీరో విజయ్ వార్నింగ్

జనాభా లెక్కల గురించి జిల్లా జిల్లా కలెక్టర్లను కేంద్రం బడ్జెట్ అంచనాలు అడిగిందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. 2026లో పూర్తి చేసి 2027లో జనాభా లెక్కలు నోటిఫై చేస్తారనే అంచనా ఉందన్నారు. దీనికి అనుగుణంగా కేంద్రం డిలిమిటేషన్ కు సమాయత్తమవుతోందని వెల్లడించారు.అందుకే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకుండా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button