Brahmin Political Quota Reservation: బ్రాహ్మణులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలనే అంశంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ ఒకవేళ ఎస్‌ఈబీసీ జాబితాలో ఉన్న వర్గాలకు ప్రాతినిధ్యం లేకపోతే, వారిని పీబీసీలుగా గుర్తించి రిజర్వేషన్లు కల్పించడంలో ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. బ్రాహ్మణులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలన్న పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యూత్ ఫర్ ఈక్వాలిటీ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
స్థానిక ఎన్నికల్లో ప్రాతినిధ్యం లేదంటూ..
బ్రాహ్మణులు సామాజికంగా, విద్యాపరంగా ఉన్నతస్థితిలో ఉన్నప్పటికీ, స్థానిక ఎన్నికల్లో సరైన ప్రాతినిధ్యం లేదని యూత్ ఫర్ ఈక్వాలిటీ అనే స్వచ్ఛంద అభిప్రాయపడింది. అందువల్ల వారిని రాజకీయంగా వెనకబడిన తరగతులు(పీబీసీ)గా పరిగణించి రిజర్వేషన్లు కల్పించాలని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. సుప్రీం ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిప్పటికీ.. సాధారణంగా సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన వర్గాల(ఎస్ఈబీసీ) నుంచే రాజకీయ వెనకబాటుతనం పుడుతుందని ప్రాథమికంగా అభిప్రాయపడింది. ఒకవేళ ఎస్‌ఈబీసీ జాబితాలో ఉన్న వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లేకపోతే వారిని పీబీసీలుగా గుర్తించి రిజర్వేషన్లు కల్పించడంలో అర్థం ఉందని కోర్టు అభిప్రాయపడింది. అనంతరం విచారణను వాయిదా వేసింది.





