Wednesday, March 11, 2026
Homeఅంతర్జాతీయంఅమెరికాలో రిలయన్స్ భారీ ప్రాజెక్టు

అమెరికాలో రిలయన్స్ భారీ ప్రాజెక్టు

  • రిలయన్స్‌తో అమెరికా ప్రభుత్వం ఒప్పందం

  • డొనాల్డ్ ట్రంప్ వెల్ల‌డి

వాషింగ్టన్, క్రైమ్‌మిర్ర‌ర్‌:దేశంలోనే భారీ చమురు శుద్ధి కర్మాగార ప్రాజెక్టును టెక్సాస్‌లో ఏర్పాటు చేయుట‌కు అమెరికా అధ్య‌క్షులు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించారు. 300 బిలియ‌న్ డాల‌ర్ల ప్రాజెక్టుగా పేర్కొన్నారు. ఈ భారీ ప్రాజెక్టులో భార‌త దేశంకు చెందిన రిల‌యన్స్ ఇండ‌స్ట్రీ భాగ‌స్వామి కావ‌డం విశేషం. ఇది అమెరిక‌న్ కార్మికుల‌కు ఇంధ‌నం వృద్ది ద‌క్షిణ టెక్సాస్ ప్ర‌జ‌ల‌కు భారీగా విజ‌య‌మ‌ని ట్రంప్ పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్టు దేశీయ ఇంధన ఉత్పత్తిని బలోపేతం చేయడానికి, పారిశ్రామిక పెట్టుబడులను విస్తరించడానికి ఓ ముఖ్యమైన దశగా ఉంటుంది. బ్రౌన్స్‌విల్లే నౌకాశ్రయంలో ఉనికిలో ఉండే అమెరికా ఫస్ట్ రిఫైనింగ్ సంస్థ దీనిని అభివృద్ధి చేస్తుంది. ట్రంప్ ఈ ప్రాజెక్టును ఆర్థిక, వ్యూహాత్మక మైలురాయిగా పేర్కొన్నారు.

గత 50 ఏళ్లలో అమెరికా గడ్డపై నిర్మించతలపెట్టిన మొట్టమొదటి రిఫైనరీ ఇదే కావడం విశేషం. ఈ మెగా ప్రాజెక్టులో భారతీయ దిగ్గజ సంస్థ ’రిలయన్స’ కీలక భాగస్వామిగా చేరడం అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. సుమారు 300 బిలియన్ల డాలర్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా అమెరికా`భారత్ మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి.

ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన, అత్యాధునికమైన రిఫైరీగా దీనిని తీర్చిదిద్దనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ డీల్ కుదుర్చుకున్నందుకు రిలయన్స్ యాజమాన్యానికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ భాగస్వామ్యం ఇరు దేశాలకు గెలుపు లాంటిదని అభివర్ణించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments