Friday, February 20, 2026
Homeఆంధ్ర ప్రదేశ్క్రీడలతో మానసికోల్లాసం

క్రీడలతో మానసికోల్లాసం

  • పని ఒత్తిడి నుంచి ఉపశమనం 
  • రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత
అమరావతి, క్రైమ్ మిర్రర్:అమరావతిలోని మంగళగిరి 6వ బెటాలియన్ ఏపీఎస్పీ వేదికగా జరిగిన రెండవ ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ టి20 క్రికెట్ టోర్నమెంట్‌ను ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇతర ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరంతరం ప్రజా భద్రత కోసం 24 గంటలు శ్రమించే మన పోలీసు సోదరులకు మానసిక ఉల్లాసం, ఐక్యతను పెంపొందించడానికి ఇటువంటి క్రీడలు ఎంతో అవసరమని పేర్కొన్నారు.
సుమారు 6 రాష్ట్రాల‌ నుండి వచ్చిన 10 జట్లకు  శుభాకాంక్షలు తెలుపుతూ క్రీడల్లో గెలుపోటముల కంటే క్రీడా స్ఫూర్తితో పాల్గొనడమే ముఖ్యమని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
మన అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దే లక్ష్యంతో  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకు సాగుతున్న తరుణంలో, ఇలాంటి జాతీయ స్థాయి క్రీడా కార్యక్రమాలు ఇక్కడ జరగడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ టోర్నమెంటు ఫిబ్రవరి 20 నుండి 24 వరకు జరగనున్నట్లు తెలిపారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments