వ్యాపారులు రైతుల వద్దకు వచ్చి కొనుగోలు
సగటను క్వింటాల్‌కు 20వేలు
గుంటూరు, క్రైమ్ మిర్రర్: తెలుగు రాష్ట్రాల్లో పండించే మిరప పంటకు ప్రపంచ స్థాయిలో గిరాకీ ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ పండించే పంట నాణ్యతతో పాటు మంచి రంగు, రుచి, ఘాటుగా ఉండడం వీటి ప్రత్యేకతగా. ఏటా సాగుచేస్తున్న మిరిచి రైతులకు గిట్టుబాటు ధర లేక చేసిన అప్పులు ఎక్కువై కొందరు సాగును చేయడం మానివేయగా, కొంత మంది రైతులు సాగు చేసే విస్తీర్ణం తగ్గించుకొని సాగు చేశారు. కాగా సారి వేసిన రైతులకు మిరిచి పంట వేసిన రైతులకు కనివిని ఎరుగని రీతిలో డిమాండ్ ఉండడంతో రైతన్నకు కాసుల పంట పండ నుంది.
రైతుల వద్దకే వ్యాపారులు…
\ముఖ్యంగా ఏపీలో జనవరి నుంచి మిర్చి ధరల్లో క్రమంగా పెరుగుదల కనిపించింది. క్వింటాలుకు సగటున రూ.20 వేల వరకు ధర లభిస్తోంది. జనవరి నుంచి ఇప్పటి వరకు సగటున క్వింటాలుకు రూ.5 వేలకు పైగానే ధర పెరిగింది. మిర్చికి డిమాండ్ పెరగడంతో వ్యాపారులు నేరుగా గ్రామాలకు చేరుకుని మధ్యవర్తుల జోక్యం లేకుండానే రైతుల వద్ద నుంచి పంట కొనుగోలు చేస్తున్నారు.
దీంతో గత నాలుగైదేళ్లుగా నష్టాలను చూసిన మిర్చి రైతులకు తాజా ధరలు ఉపశమనం అందించాయి. మార్కెట్లో మంచి ధర పలకడంతో ప్రస్తుతం శీతల గోదాముల్లో నిల్వ చేసిన సరకు కొద్ది కొద్దిగా తగ్గడం మొదలైంది. ఇక గుంటూరు మార్కెట్ యార్డుకు గత వారంలో 1.29 లక్షల బస్తాల మిరప రాగా ఇందులో ఏకంగా 1.26 లక్షల బస్తాల వరకు అమ్ముడయ్యాయి.
తగ్గిన సాగు విస్తీర్ణం…
వరుసగ ఐదేళ్లు మిర్చి పంటకు సరైన గిట్టు బాటు ధర లభించక చేసన అప్పులను భరించలేక తెలుగు రాష్ర్టాల్లోనే కాకుండా కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో సైతం తగ్గింది.ఉత్పత్తి తగ్గడంతో డిమాండ్ పెరిగినట్లైంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ అధికంగా ఉండటంతో జనవరి నెల నుంచే ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. గతేడాది క్వింటాల్ మిర్చీ కేవలం రూ. 10 వేలలోపు మాత్రమే పలికింది.
ఈ సారి రూ.20 వేలకు పైగానే ధర పలుకుతోంది. తేజ మిర్చి ధర జనవరి, ఫిబ్రవరిలో రూ.15 వేలు ఉంటే ప్రస్తుతం ఏకంగా రూ.19,500కు చేరుకుంది. తాలు రకం కూడా క్వింటాలు ధర రూ.10 వేలకు పైగానే పలుకుతుంది. ఇలా జనవరి నెల నుంచే అన్ని రకాల మిర్చీకి ధరల్లో ఘననీయమైన పెరుగుదల కనిపించింది. పంటలు 50 శాతం తగ్గడం, గోదాముల్లో మిర్చీ నిల్వలు తక్కువగా ఉండటంతో వ్యాపారులు పోటీపడి మరీ పంటను కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లో ధరలు ఊపందుకోవడంతో రైతులు మిర్చి పంట కోతలు కోసిన వెంటనే త్వరితగతిన ఆరబెట్టి మార్కెట్‌కు తరలిస్తున్నారు.
