తెలంగాణ

హైదరాబాద్‌లో భారీగా పడిపోయిన రియల్ ఎస్టేట్

తెలంగాణ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ భారీగా పడిపోయింది.
ఇళ్ళ అమ్మకాలు, కొత్త ఇళ్ళ సరఫరాలో హైదరాబాద్ వెనుకంజలో ఉంది. గతేడాది 2024 జనవరి-మార్చి మధ్య 14,298 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు జరగగా.. ఈ ఏడాది 26 శాతం తగ్గి 10,647 యూనిట్ల ఇళ్ల అమ్మకాలే జరిగినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ప్రాప్ టైగర్ వెల్లడించింది

హైదరాబాద్‌లో ఇళ్ళ అమ్మకాలు భారీగా పడిపోగా బెంగళూరులో 13 శాతం, చెన్నైలో 8 శాతం పెరిగాయి.కొత్త ఇళ్ళ సరఫరాలో సైతం హైదరాబాద్‌లో 33 శాతం తగ్గగా బెంగుళూరులో 83 శాతం పెరిగింది. రేవంత్ సర్కార్ నిర్ణయాలు, హైడ్రా, ప్రభుత్వంలో కదలిక లేకపోవడం వంటి అంశాల వల్లే రియల్ ఎస్టేట్ భారీగా పడిపోయిందని తెలుస్తోంది. మార్కెట్ లో మనీ ఫ్లో బాగా తగ్గిపోయిందని.. రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ మరింతగా పతనమవుతుందనే అంచనా వేస్తున్నారు నిపుణులు.

ఇవి కూడా చదవండి .. 

  1. తెలంగాణలో ఫ్రూట్ జ్యూస్‌ తరహాలో టెట్రా ప్యాకెట్లలో మద్యం.

  2. మర్రిగూడ ఎంపిడివో రాజకీయం..!రాజకీయంగా మారిన కరువు పని? 

  3. కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!

  4. కోమటిరెడ్డిపై గుత్తా తిరుగుబాటు.. రెండుగా చీలిన నల్గొండ కాంగ్రెస్?

  5. ఆస్తి కోసం కూతురును చంపి సవతి తల్లి.. నదిలో పాతి పెట్టిన వైనం!..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button