
-
సీఎం రేవంత్ అయ్యాక పడిపోయిన భూముల ధరలు
-
ఇక్కడ ఎకరం అమ్మితే ఏపీలో 10 ఎకరాలు వచ్చేవి
-
ఇప్పుడు ఏపీలో ఎకరం అమ్మితే ఇక్కడ రెండెకరాలు వస్తున్నాయి
-
చంద్రబాబు, రేవంత్ ముఖ్యమంత్రులయ్యాక సీన్ రివర్స్
-
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఢమాల్ అయిందని, ఒకప్పుడు తెలంగాణలో ఉన్న భూమ్ ఇప్పుడు ఏపీకి తరలివెళ్లిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014 నుంచి 2024వరకు తెలంగాణ రియల్ ఎస్టేట్‌లో ఓ వెలుగు వెలిగిందని, హైదరాబాద్ చుట్టుపక్కల భూములన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడుపోయేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు హరీశ్‌రావు.
కేసీఆర్ హయాంలో తెలంగాణలో ఒక ఎకరం భూమి అమ్మితే ఏపీలో 10 ఎకరాల భూమి వచ్చేదన్నారు. ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయిపోయిందని, ఏపీలో ఒకరం అమ్మితే… ఇక్కడ రెండెకరాలు కొనొచ్చని ఆవేదన వ్యక్తం చేశారు హరీశ్. సీఎం రేవంత్ రెడ్డి పాలనను ఇన్వెస్టర్లు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఆయనకు పాలన చేతకాకపోవడంతో పెట్టుబడిదారులు ముందుకు రావడంలేదని విమర్శించారు.
మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో హరీశ్‌రావు ఈ వ్యాఖ్యలు చేశారు. మరో రెండేళ్లు కాంగ్రెస్ పాలన ఇలాగే కొనసాగితే భూముల ధరలు సగానికి పడిపోయే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే భూములు కొన్న పేదలు అమ్ముడుపోక ఆవేదనలో ఉన్నారని గుర్తు చేశారు. ప్రజలంతా మళ్లీ కేసీఆరే రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ చేసింది గోరంత అయితే… చెప్పుకునేది కొండంత అని విమర్శలు గుప్పించారు హరీశ్‌రావు.
మెజార్టీ జెడ్పీలు గెలుస్తాం
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సత్తాచాటబోతోందని హరీశ్‌రావు జోస్యం చెప్పారు. 31 జిల్లా పరిషత్‌లకు గాను 18 బీఆర్‌ఎస్‌కే దక్కబోతున్నాయన్నారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో ఇది తేటతెల్లమయిందని పేర్కొన్నారు. ప్రజలను బీఆర్‌ఎస్‌కే పట్టం కట్టాలని ఆయన పిలుపునిచ్చారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ ఎలా ఉండేది… ఇప్పుడు ఎలా ఉంది అనేది బేరీజు వేసుకోవాలని హరీశ్ సూచించారు.
Read Also: