Tuesday, March 24, 2026
HomeజాతీయంWPL 2026: స్మృతి వీర విహారం.. రెండోసారి ఛాంపియన్‌ గా ఆర్సీబీ!

WPL 2026: స్మృతి వీర విహారం.. రెండోసారి ఛాంపియన్‌ గా ఆర్సీబీ!

RCB Create History: మహిళల ప్రీమియర్ లీగ్‌ ఫైనల్లో రికార్డు స్కోర్ కొట్టినా ఢిల్లీ క్యాపిటల్స్ కల సాకారమవ్వలేదు. తొలి కప్‌ను ఒడిసిపట్టాలని భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉఫ్‌మనిపించింది. జార్జియా వోల్(79), కెప్టెన్ స్మృతి మంధాన(87)లు వీరవిహారం చేశారు. ఢిల్లీ బౌలింగ్‌ ను ఊచకోత కోస్తూ.. బౌండరీల మోతతో చెలరేగారు. వీరిద్దరూ రెండో వికెట్‌ కు 165 పరుగుల జోడించి.. ఆర్సీబీని గెలుపు దిశగా నడిపారు. వోల్, మంధాన ఔటయ్యాక ‌డీ క్లెర్క్ (6 నాటౌట్), రాధా యాదవ్(8 నాటౌట్) లాంఛనం పూర్తి చేచేశారు. అంతే.. నాలుగోసారైనా కప్‌ను ముద్దాడాలనుకున్న ఢిల్లీ ఫైనల్ ఫోబియాతో మంచి అవకాశాన్ని చేజార్చుకుంది.

మళ్లీ రన్నరప్ గానే ఢిల్లీ క్యాపిటల్స్..

డబ్ల్యూపీఎల్ చరిత్రలో మరోసారి రన్నరప్‌ ట్యాగ్‌కే పరిమితమైంది ఢిల్లీ క్యాపిటల్స్. వడోదరలో జరిగిన ఫైనల్లో రికార్డు స్కోర్ చేసినా ఆర్సీబీ ముందు ఢిల్లీ నిలువలేకపోయింది. భారీ ఛేదనలో తొలి ఓవర్లో రెండు ఫోర్లు బాదిన గ్రేస్ హ్యారిస్‌(8)ను హెన్రీ ఔట్ చేసింది. ఆ తర్వాత కెప్టెన్ స్మృతి మంధాన(87)జతగా జార్జియా వోల్(74) బౌండరీలతో చెలరేగింది. అర్ధ శతకం పూర్తి చేసుకుంది. కాసేపటికే మంధాన సైతం ఫిఫ్టీ అందుకుంది. వీరిద్దరు శతక భాగస్వామ్యంతో ఆర్సీబీని గెలుపు దిశగా నడిపారు. 165 రన్స్ జోడించిన ఈ ద్వయాన్ని ఎట్టకేలకు మిన్ను మని విడదీసింది.

అయినప్పటికీ, అప్పటికే బెంగళూరు విజయం ఖాయమైంది. 21 బంతుల్లో 30 రన్స్ కావాలంతే. రీచా ఘోష్‌(6)ను నందిని శర్మ వెనక్కి పంపగా ఢిల్లీ జట్టులో ఆశలు చిగురించాయి. హెన్రీ ఓవర్లో స్వీప్ షాట్ ఆడబోయిన మంధాన బౌల్డ్ కావడంతో ఉత్కంఠ నెలకొంది. ఆ తర్వాత బంతికే రాధా యాదవ్ ఇచ్చిన క్యాచ్‌ను మిన్ను మని నేలపాలు చేసింది. ఆఖరి ఓవర్లో 10 పరుగలు అసవరమవ్వగా.. రాధా యాదవ్ (8 నాటౌట్) రెండు బౌండరీలు బాదింది. 6 వికెట్ల తేడాతో గెలుపొందిన ఆర్సీబీ రెండోసారి విజేతగా నిలిచింది.

హెన్రీ, జెమీమా దూకుడు..

మొదట ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు సత్తా చాటారు. వచ్చినవాళ్లు వచ్చినట్టు దంచేయగా డబ్ల్యూటీసీ టైటల్ పోరులో ఢిల్లీ రికార్డు స్కోర్‌తో చరిత్రకెక్కింది. ఓపెనర్లు శుభారంభమివ్వగా.. జెమీమా రోడ్రిగ్స్(57) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో చెలరేగింది. ఒత్తిడికి లోనైన ఆర్సీబీ బౌలర్లను ఆఖర్లో లారా వొల్వార్డ్త్‌(44), చిన్నెల్లీ హెన్రీ(32 నాటౌట్) బెంబేలెత్తించారు. డీక్లెర్క్ వేసిన 18వ ఓవర్లో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయిన హెన్రీ 24 రన్స్ రాబట్టగా.. చివరి ఓవర్లో పది రన్స్ రావడంతో బెంగళూరుకు 204 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments