
క్రైమ్ మిర్రర్, న్యూస్:- టాలీవుడ్ హీరో, మాస్ మహారాజా రవితేజ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు తుది శ్వాస విడిచారు. హైదరాబాదులోని రవితేజ నివాసం ఉంటున్న ఇంటిలో నిన్న రాత్రి రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు మరణించినట్లుగా రవితేజ సన్నిహితులు తెలిపారు. దీంతో ఒకవైపు రవితేజ తో పాటుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. అయితే రవితేజ చిన్నప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగ్గంపేటలో నివాసం ఉండేవారు. ఒక విధంగా చెప్పాలంటే అది వాళ్ళ స్వగ్రామం. రాజగోపాల్ రాజు ఫార్మాసిస్టుగా పనిచేసేవారు. రాజగోపాల్ రాజుకు హీరో రవితేజ, రఘు మరియు భరత్ రాజ్ ముగ్గురు కుమారులు. కాగా భరత్ 2017 లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో మరణించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.
కాగా రవితేజ తండ్రి మరణ వార్త తెలుసుకొని టాలీవుడ్ లోని ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. తాజాగా రవితేజ తండ్రి మరణ వార్తను విని చాలా బాధపడ్డానంటూ మెగాస్టార్ చిరంజీవి ఒక ప్రకటన ద్వారా తెలిపారు. చివరిగా వాల్తేరు వీరయ్య మూవీ షూటింగ్ సెట్లో రవితేజ తండ్రి రాజగోపాల రాజును కలిచానని చిరంజీవి చెప్పుకొచ్చారు. రవితేజ కుటుంబానికి చిరంజీవి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరోవైపు రవితేజ తండ్రి మరణ వార్త నిజంగా నన్ను చాలా తీవ్రంగా బాధించిందని దర్శకుడు గోపీచంద్ మలినేని సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ఇలాంటి కష్ట సమయంలో రవితేజ అన్నా చాలా ధైర్యంగా ఉండాలని గోపీచంద్ మలినేని కోరారు. అలాగే ఈ వార్తలు తెలుసుకున్న రవితేజ అభిమానులు రవితేజ అన్న ధైర్యంగా ఉండాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.