తెలంగాణ

ఎలుకల కాట్లు .. విద్యార్థులకు ఘాట్లు…!

ఎలుకల కాట్లు .. విద్యార్థులకు ఘాట్లు…!

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేసిన వైద్యులు..!

విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డ కేజీవీబీ టీచర్స్ …!

నవాబుపేట్ కేజీబీవీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన…!

పాఠశాల టీచర్స్ నిర్లక్ష్యం పై తల్లిదండ్రుల ఆగ్రహం…!

పాఠశాల విద్యార్థులను పరామర్శించిన మండల అధికారులు…!

పునరావృత్తమైతే చర్యలు తప్పవని ఎస్ఓని హెచ్చరించిన ఎమ్మార్వో.. ఎంపిడివో…!

క్రైమ్ మిర్రర్ /వికారాబాద్ జిల్లా ప్రతినిధి:- ఎలుకలు కరవడంతో విద్యార్థుల కాళ్లకు ఘాట్లయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.వికారాబాద్ జిల్లా నవాబుపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో గత నెల22,27న విద్యార్థులు నిద్రిస్తున్నారు.ఆ సమయంలో 8 మంది విద్యార్థులను ఎలుకలు కొరకడంతో కాళ్లకు గాయాలు అయి తీవ్ర నొప్పితో ఇబ్బంది పడిన విద్యార్థులు సిబ్బంది దృష్టికి తీసుకువచ్చారు.ఆ తర్వాత విద్యార్థులను నవాబ్ పేట్ ప్రభుత్వాసుపత్రిలో రేబీస్‌ టీకా వేయించి,విషయం బయటకు పొక్కకుండా కేజీబీవీ టీచర్స్ జాగ్రత్తపడ్డారు.వారం రోజుల క్రితం 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని టీచర్స్ ఇంటికి పంపించారు.తల్లిదండ్రులు కూతురికి చికిత్స అందించి తిరిగి పాఠశాలకు తీసుకువచ్చి ఎలుకలు కరిస్తే చికిత్స కూడా చేయించారా ? అంటూ ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాఠశాలలో ఎలకల బెడద తీవ్రంగా ఉందని విద్యార్థులు బయట నుండి తెచ్చుకునే ఆహార పదార్థాల వల్లే ఎలుకలు లోపలికి వస్తున్నాయని పాఠశాల శ్రీలత తల్లిదండ్రులకు తెలిపారు.ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ జయరాం,ఎంపీడీఓ అనురాధ,ఎంఈఓ రెహమాన్,వైద్యాధికారి రోహిత్ అప్రమత్తమై కస్తూర్బా గాంధీ పాఠశాలను పరిశీలించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు.డాక్టర్ రోహిత్ విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి మెడిసిన్ వాడాలని విద్యార్థులకు తెలిపారు.ఇలాంటిది మరోసారి పునరావృత్తం కాకుండా చూసుకోవాలని తహసీల్దార్ జయరాం. ఎంపీడీఓ అనురాధ,ఎంఈఓ రెహమాన్ కేజీబీవీ ఎస్ఓ శ్రీలత సూచించారు.పాఠశాల ఆవరణలో చెత్తచెదారం లేకుండా చూసుకోవాలి.ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా పెట్టుకోవాలి పేర్కొన్నారు.

పరామర్శించిన బీఆర్‌ఎస్‌ మండల కమిటీ.. : కేజీబీవీ పాఠశాలలో సోమవారం టిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ సభ్యులు సందర్శించి ఎలుకలు కరిచిన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల వద్ద ఆరా తీశారు.అధికారుల పర్యవేక్షణ లేకపోవడం,నిర్లక్ష్యంగానే ఈ ఘటన జరిగిందని ఇన్ని రోజులు జరుగుతున్న ఈ విషయాన్ని బయటికి,మండలాధికారుల దృష్టికి తీసుకపోకపోవడం పై కేజీబీవీ ఉపాధ్యాయులు చెప్పకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇలాంటి ఘటన మరోసారి పునరావృత్తం కావద్దని చెప్పారు.ఈ పాఠశాల సందర్శనలో ఎంపీఓ విజయ్ కుమార్,ఆర్ఐ, బీఆర్ఎస్ నాయకులు,విద్యార్థుల తల్లిదండ్రులు,తదితరులు ఉన్నారు.

మామిడి సీజన్ లో సమస్యలు లేకుండా చూస్తాం: చిలుక మధు సూధన్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button