తెలంగాణ

రంగములోకి దిగిన రాట్ హోల్ మైనర్స్… ప్రతి ఒక్కరిలోనూ ఉత్కంఠత?

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల క్రితం SLBC సొరంగంలో ప్రమాదం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం రాట్ హోల్ మైనర్స్ ను రంగంలోకి దింపింది. అయితే తాజాగా ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకున్న ఆరుగురు రాట్ హోల్ మైనర్లు కాసేపట్లో టన్నెల్ వద్దకు చేరుకోబోతున్నారు. వీళ్ళ రాకతో సొరంగంలో చిక్కుకున్న మనుషులు సురక్షితంగా బయటకు వస్తారా?… లేదా?.. అనేది అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది.

ఘోర రోడ్డు ప్రమాదం…ట్రాక్టర్-బస్సు ఢీకొన్న ఘటనలో మహిళ మృతి

అయితే వీళ్ళు 2023లో ఉత్తరకాండ్ సిల్క్ యారా సొరంగంలో దాదాపుగా 41 మంది కార్మికులు సొరంగంలో చిక్కుకోగా… దాదాపు 17 రోజులు వరకు కూడా ఎవరు వాళ్ళని సురక్షితంగా బయటకు తీసుకురాలేకపోయారు. కానీ చివరికి ఈ ర్యాట్ హోల్ మైనర్లు ఒక్కరోజులోనే వాళ్లందర్నీ కూడా బయటకి సురక్షితంగా తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఎలాగైనా ఈరోజు లేదా రేపటిలోగా వాళ్ళని సురక్షితంగా బయటకు తీసుకురావాలనే ఆలోచనతో ఢిల్లీ నుంచి హైదరాబాదుకు ఈ రాట్ హోల్ మైనర్స్ ను దించింది. దీంతో రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా వీళ్ళ పనిపై దృష్టి పెట్టారు. SLBC లో చిక్కుకున్న వారిని సురక్షితంగా ఎన్ని గంటల్లో బయటకు తీసుకు వస్తారా అని… చాల ఉత్కంఠంగా వేచి చూస్తున్నారు. కాగా ఈ ఘటనలపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఉత్తంకుమార్ రెడ్డి.. మరోవైపు ప్రతిపక్ష నేతలు అందరూ కూడా ఒక్కొక్కరు ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను కూడా ఇప్పటికే విచారణ కూడా ప్రారంభించారు.

మాజీ సర్పంచ్ శ్రీరాములు కొడుకును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి..

మనస్థాపానికి గురై… “చనిపోతున్న అమ్మ”అంటూ నోట్ బుక్ లో రాసి సూసైడ్ చేసుకున్న 8వ తరగతి విద్యార్థి!..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button