మన టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు బుచ్చిబాబు కాంబినేషన్లో సినిమా రాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో కన్నడ కీలక నటుడు నటించబోతున్నారని విషయం ప్రస్తుతం వైరల్ అవుతుంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లుగా చిత్ర బృందం తెలిపింది. మన టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఇద్దరు కలిసి నటించబోయే మొట్టమొదటి సినిమా కావడంతో ప్రేక్షకుల్లోనూ ఉత్కాంటత నెలకొంది.
గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ కు ఎంపికైన మన భారతీయ చిత్రం?
గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో శివరాజ్ కుమార్ పాత్ర రామ్ చరణ్ కు ప్రేరణ ఇచ్చే విధంగా ఉంటుందని సమాచారం అందింది. ఇప్పటికే రామ్ చరణ్ మరియు బుచ్చిబాబు కాంబినేషన్లో ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపుగా మొదలైందని అంటున్నారు. ఉప్పెన లాంటి సూపర్ హిట్ సినిమా తీసిన తర్వాత రామ్ చరణ్ తో సినిమా తీయడం అనేది మామూలు విషయం కాదు. దాదాపు మూడేళ్ల పాటు స్క్రిప్ట్ రాసుకుంటూ బుచ్చిబాబు కాలాన్ని గడిపారట. తీస్తే రాంచరణ్ తోనే తీయాలని మైండ్ గా ఫిక్స్ అయ్యి ఆలస్యం చేయకుండా రాంచరణ్ కు చెప్పడంతో వెంటనే రామ్ చరణ్చే కూడా ఓకే చెప్పడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్.
పట్టణాల నుండి గ్రామాలకు పాకిన సైబర్ స్కామ్స్!… జాగ్రత్త?
ఇప్పటికే మైసూర్ లో ఒక షెడ్యూల్ ముగించగా మరో షెడ్యూలు సిటీలో స్టార్ట్ చేశారట. చాలా స్పీడ్ గా ఈ సినిమా కంప్లీట్ చేసేసి రిలీజ్ చేయాలనే ఆలోచనలో బుచ్చిబాబు ఉన్నట్లు చిత్ర యూనిట్ సమాచారం అందజేసింది. స్క్రిప్ట్ పూర్తిగా క్లారిటీగా ఉండడంతో బుచ్చిబాబుకు ఒక గంట కూడా గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం లేదట. ఈ తరహా లోనే సినిమా గురించి అప్డేట్స్ అలాగే ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి.