ఆర్జీవి అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది అతని మైండ్ సెట్. అతను చేసే పనులన్నీ కూడా దాదాపు 90 శాతం మందికి నచ్చవు. కానీ నేను ఒకప్పటిలా లేను ప్రస్తుతం మారిపోయాను అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక పెద్ద లేఖను రాసుకోచ్చారు.
అయితే చాలా రోజుల నుండి ఆయన రాత్రి చెప్పిన మాట పొద్దున్నే మార్చేస్తుంటాడు. ఆ మాటలు నమ్మితే నట్టేట మునిగినట్లే. వర్మపై ఇండస్ట్రీలో ఉన్న ఒపీనియన్ ఇది. దాన్నిప్పుడు మార్చేయాలని ప్లాన్ చేస్తున్నారు వర్మ. రాజాలో వెంకటేష్‌లా అదంతా అప్పుడండీ.. ఇప్పుడు నేను మారిపోయానండీ అంటున్నాడు.
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్!..ఇకపై వాట్సాప్ ద్వారా బర్త్ , డెత్ సర్టిఫికెట్లు ఈజీగా పొందొచ్చు?
నేనింతే.. అంతా నాయిష్టం.. మనల్నెవడ్రా ఆపేది.. ఇదిగో ఇలాంటి టైటిల్స్ అన్నీ రామ్ గోపాల్ వర్మకు బాగా సూట్ అవుతాయి. ఎవరేం చెప్పినా.. తాను అనుకున్నదే చేస్తుంటారు ఆర్జీవీ. అలాంటి బ్రాండ్ క్రియేట్ చేసారు ఈ దర్శకుడు. అలాంటిదిప్పుడు ఈయనలో మార్పు మొదలైంది.. ఇకపై మంచి సినిమాలే చేస్తా.. చేయకపోతే చంపేయండి అంటున్నారు.
మీటింగ్ లోనే ఆన్లైన్ రమ్మీ గేమ్ ఆడిన DRO.
సత్య సినిమా 27 ఏళ్ళ తర్వాత రీ రిలీజ్ అయింది. ఈ సందర్భంగా సినిమాను చూసిన వర్మ.. భావోధ్వేగానికి గురయ్యారు. కన్నీళ్ళు పెట్టుకుంటూ ట్విట్టర్‌లో పెద్ద లేఖ రాసారు. సత్య, రంగీల తర్వాత తన కళ్లు నెత్తికెక్కాయని.. అంత గొప్ప సినిమాలు తీసిన తాను.. ఎంతో చెత్త కూడా తీసానని గుర్తొచ్చి కన్నీళ్లు ఆగట్లేదన్నారు RGV.ఇకపై గౌరవాన్ని పెంచే సినిమాలు చేస్తానని మాటిచ్చారు వర్మ. బ్రాండ్ న్యూ వర్మను చూస్తారంటూ ప్రమాణం చేసారు. ఒకవేళ అలా చేయకపోతే.. తన తలలో పిస్టల్ గురిపెట్టి షూట్ చేసి చంపేయండంటున్నారు వర్మ. మరి ఈ దర్శకుడిలో వచ్చిన మార్పు నిజమేనా..? నేనింతే అనే వర్మ నేను మారతా అంటే నమ్మొచ్చా అనేది ఆడియన్స్‌లో ఉన్న అనుమానం. ఇకపై ఆయన వైఖరి ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే.
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్!..ఇకపై వాట్సాప్ ద్వారా బర్త్ , డెత్ సర్టిఫికెట్లు ఈజీగా పొందొచ్చు?