![](https://b2466033.smushcdn.com/2466033/wp-content/uploads/2025/02/images-44.jpeg?lossy=1&strip=1&webp=1)
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఐపీఎల్ 2025 సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు తమ కొత్త కెప్టెన్ ను ప్రకటించింది. జట్టులోని యువ ఆటగాడు రజత్ పాటిదార్ ను ఆర్ సి బి జట్టుకు కెప్టెన్గా బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు తాజాగా ఆర్ సి బి మేనేజ్మెంట్ నుంచి అఫీషియల్ గా ప్రకటన వచ్చింది. దీంతో సోషల్ మీడియాలో ఆర్సిబి అభిమానులు కోహ్లీ అభిమానులు అందరూ కూడా వైరల్ చేస్తున్నారు. కాగా యంగ్ ప్లేయర్ రజత్ 2021 నుంచి ఆర్సిబి జట్టులో కీలక వ్యక్తిగా ఉన్నాడు. జట్టు భారీ రన్స్ చేయడంలో పాటిధర్ బాగా హెల్ప్ చేశాడు. అంతేకాకుండా ఇటీవల మెగా వేళానికి ముందు కూడా ఆర్సిబి జట్టు ఈ యువ ఆటగాడిని రిటైన్ చేసుకున్న విషయం అందరికి తెలిసిందే.
సామాజిక సేవలో ఉన్న సంతృప్తి దేనిలోను లేదు: MLA కోమటిరెడ్డి
ఇక రజత్ పట్టిదర్ ఐపీఎల్ మొత్తంలో 27 మ్యాచ్ లాడి 34.7 సగటుతో 159 స్ట్రైక్ రేట్తో 799 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఏడు అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. ఐపీఎల్ లో పటిదార్ అత్యధిక స్కోరు 112. అయితే మొదటగా విరాట్ కోహ్లీ నే మళ్లీ ఆర్సిబి కెప్టెన్ గా పెట్టాలని చాలానే సోషల్ మీడియాలో వార్తలు రాగా.. అవన్నీ ఇవాల్టితో ముగిసి పోయాయి. రజత్ పట్టిదర్ ఆర్సిబి కొత్త కెప్టెన్ అంటూ ఆర్సిబి మేనేజ్మెంట్ ప్రకటించడం జరిగింది. దీంతో ఆర్ సి బి కి చిరకాల కోరికగా మిగిలిపోయిన ఐపీఎల్ ట్రోఫీ అనేది ఈసారైనా దక్కించుకుంటుందో లేదో వేచి ఉండాల్సిందే.
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్!..
అన్ని పథకాలు ఈ ఏడాదిలోనే ప్రారంభించాలి!… బడ్జెట్లో నిధులు కేటాయించండి : AP CM