క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :
రాజస్థాన్లో బోరుబావిలో పడ్డ చిన్నారి తాజాగా మృతి చెందింది. దాదాపుగా పది రోజులపాటు శ్రమించి అధికారులు బోరుబావిలో పడ్డ చిన్నారి చేతనను ఇవాళ బయటకు తీశారు. అప్పటికే కొన ఊపిరితో ఉన్న చిన్నారిని ఆసుపత్రికి తరలించగా ఫలితం దక్కలేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మరణించింది. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. అధికారులు 10 రోజులు పాటు కష్టపడ్డా కష్టానికి ఫలితం లేకుండా పోయింది.
త్వరలోనే కొత్త రేషన్ కార్డులు మంజూరు.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక అప్డేట్
కాగా గత నెల డిసెంబర్ 23 వ తారీఖున చిన్నారి చేతన అనే మూడు సంవత్సరాల బాలిక ఆడుకుంటూ పొరపాటున బోరుబావిలో పడ్డ విషయం మనందరికీ తెలిసిందే. కాగా అధికారులు వచ్చి దాదాపుగా 150 అడుగుల లోపల ఇరుక్కుపోయిందని చిన్నారి యొక్క కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కానీ పది రోజులు పాటుగా సాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్లో చివరికి చిన్నారిని బయటకు తీసుకువచ్చిన ప్రాణాలు మాత్రం దక్కలేదు. దీంతో అధికారులు చేసిన ప్రయత్నాలు అన్ని వృధా అయ్యాయి.
తిరుమలలో వైకుంఠ దర్శనాల టోకెన్లు ఇచ్చే ఏరియాలు ఇవే?
కాగా ఈ చిన్నారి యొక్క తల్లి కొద్దిరోజుల ముందు మీడియా వేదికగా అధికారులపై మండిపడ్డ విషయం మనందరికీ తెలిసిందే. కలెక్టర్లు లేదా ఏ అధికారి బిడ్డలైన ఇలా బోరుబావులో పడితే మీరు ఇన్ని రోజులు బయటకు తీసుకురాకుండా నిర్లక్ష్యం వహిస్తారా అని దయచేసి మీ బిడ్డ అనుకోని త్వరగా బయటకు తీయండి అని మీడియా వేదికగా అధికారులను వేడుకుంది. కాగా ఎట్టకేలకు పది రోజుల తరువాత అధికారులు శ్రమించి చిన్నారిని బయటకు తీసిన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులతో పాటుగా ఆ గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రభుత్వం ఎలాగైనా ఆదుకోవాలని కోరారు.