
-
రేవంత్ భాష మార్చుకోవాలని రాజగోపాల్‌రెడ్డి హితవు
-
ప్రతిపక్షాలను తిట్టడం మానుకోవాలి: రాజగోపాల్‌రెడ్డి
-
మంత్రి పదవిపై కాంగ్రెస్ హైకమాండ్ మాట ఇచ్చింది
-
ఇంకో మూడున్నరేళ్లు రేవంతే సీఎం
-
ఆ తర్వాత ఎవరన్నది ప్రజలు నిర్ణయిస్తారు: రాజగోపాల్
క్రైమ్‌మిర్రర్, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో లుకలుకలు తారాస్థాయికి చేరాయి. హస్తం పార్టీలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సాధారణమే అయినా… తాజాగా ఇవి వేరేలెవల్‌కు చేరుకున్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డిపై విమర్శలు గుప్పించేవారు ఎక్కువైపోయారు. మంత్రి పదవి రాకపోవడంతో ప్రస్ట్రేషన్‌లో ఉన్న రాజగోపాల్‌రెడ్డి ఈ విషయంలో ముందున్నారు.
ఇటీవల డిజిటల్ మీడియాపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఖండించిన విషయం తెలిసిందే. ఇవాళ మరోసారి రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి తన భాషను, హవభావాలను మార్చుకోవాలని సూటిగా చెప్పారు. గంటలు గంటలు మాట్లాడుకోవడం మానుకొని… పనిపై శ్రద్ధపెట్టాలని హితవు పలికారు రాజగోపాల్ రెడ్డి.
ప్రతిపక్షాలను తిట్టడం మానుకొని.. ప్రభుత్వం ఏం చేస్తుందో, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలేంటో ప్రజలకు వివరించాలని సూచించారు కోమటిరెడ్డి. సీమాంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారని, వారిని నివారించాలన్నారు. అలాగే మంత్రి పదవి విషయంలో తనకు కాంగ్రెస్ హైకమాండ్ మాట ఇచ్చిందని తెలిపారు. ఈ విషయం అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలియదని చెప్పారు. అందరూ కలిసి పనిచేస్తేనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఇంకో మూడున్నరేళ్లు రేవంత్ రెడ్డే సీఎం అని, ఆ తర్వాత ఎవరన్నది ప్రజలు నిర్ణయిస్తారని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కుండబద్దలు కొట్టారు.
ఇవీ చదవండి