
క్రైమ్ మిర్రర్,ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ జర్నలిస్ట్స్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షులు, గీతా పారిశ్రామిక కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ జన్మదినోత్సవం సందర్భంగా హైదరాబాద్ సరూర్‌నగర్ లోని వారి నివాసానికి భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి వెళ్లి పుష్పగుచ్ఛాన్ని అందజేసి శాలువతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పల్లె రవికుమార్ గౌడ్ నిండు నూరేళ్ళు, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరారు. అనంతరం పల్లె రవికుమార్ గౌడ్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బొడ్డు గోపాల్ గౌడ్, బడేటి సత్యనారాయణ గౌడ్, నరేష్ గౌడ్, బాదేపల్లి పులిరాజు గౌడ్, ఆదిరాల రమేష్, తీగల శ్రీనివాస్, మహేష్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి