
Telangana Rains: రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అక్టోబర్ 2 వరకు తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. ఇవాళ ఆదిలాబాద్, కొత్తగూడెం, హన్మకొండ, జగితాల్య, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
ఆదివారం నాడు వర్షాలు కురిసే జిల్లాలు
ఆదివారం రోజున ఆదిలాబాద్, కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. హైదరాబాద్, జనగాం, జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నాగర్ కర్నూల్, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ బలమైన ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయని తెలిపింది.
సోమ, మంగళవారాల్లో వానలు ఎక్కడ పడుతాయంటే?
సెప్టెంబర్ ఒకటిన ఆదిలాబాద్, కొత్తగూడెం, హన్మకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, ఆసిఫాబాద్, ములుగు, వరంగల్, జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. సెప్టెంబర్ 2న ఆదిలాబాద్, కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, భూపాలపల్లి, గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, భువనగిరి జిల్లాల్లో వర్షాలు పడే సూచనలున్నాయని వివరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
గాంధారిలో అత్యధిక వర్షపాతం నమోదు
అటు గడిచిన 24గంటల్లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా కామారెడ్డి జిల్లాల్లో గాంధారి మండల కేంద్రంలో 27.4, సర్వాపూర్‌లో 27.4 సెంటీమీటర్ల భారీ వర్షాపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు.