
Telangana Rains: వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, మరికొద్ది గంటల్లో బలపడనున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో మరో 2 రోజులు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురస్తాయ ని అంచనా వేసినట్టు తెలిపింది.
అల్పపీడనం ప్రభావంతో మంగళవారం ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, కుమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, వరంగల్, వికారాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈ దురుగాలులతో భారీ వర్షాలు కురిసినట్టు తెలిపింది.
ఇక ఇవాళ, రేపు (బుధ, గురువారాల్లో) ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు వెల్లడించింది.