
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఎడతెరిపి లేకుండా పడుతున్న భారీ వర్షాలకు ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే దాదాపు వారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్న… వాతావరణ శాఖ మరో మూడు రోజులపాటు భారి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని సూచనలు చేసింది. ఏపీలో అల్లూరి, కాకినాడ, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక మిగతా శ్రీకాకుళం, మన్యం, కోనసీమ మరియు విజయనగరం వంటి జిల్లాలలో అక్కడక్కడ సాధారణ వర్షపాతం నమోదు అవుతుంది అని పేర్కొంది.
Read also : రజనీకి తగ్గని క్రేజ్!.. రెండు రోజులకే 200 కోట్లా?
మరోవైపు తెలంగాణలో కొత్తగూడెం, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు వంటి జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు ఇప్పటికే కురుస్తున్న… మరో కొద్ది రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూనే ఉండే ఛాన్స్ ఉందని తెలంగాణ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో ప్రతి ఒక్కరు కూడా బయటకు రావాలి అంటేనే భయంతో వణికి పోతున్నారు. పల్లెటూర్లలోని ప్రజలు… వ్యవసాయ పనుల నిమిత్తం బయటకు రావాలి అంటేనే వర్షం కారణంగా పనులను వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఇక పట్టణాల్లోని ప్రజల జాబ్స్ కు అడ్డంకి గా మారింది. రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. గ్రామాల్లోని చెరువులు పొంగిపొర్లుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్క మనిషికి కూడా ఏదో విధంగా విపరీతమైన వర్షాల కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎంతోమంది రైతులు కొన్ని విధాలుగా నష్టపోయారు. ఈ భారీ వర్షాల కారణంగా ఇప్పటికే కొంతమంది అనారోగ్యంతో, మరి కొంతమంది వరదల కారణంగానూ మరణించారు. మరికొన్ని రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఎటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించినప్పటి నుంచి ప్రజల్లో ఇంకా భయం నెలకొంది.
Read also : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ