తెలంగాణ

మరో 5 రోజులు వానలు, ఎప్పుడు, ఏ జిల్లాల్లో కురుస్తాయంటే?

Telangan Weather Report: రాష్ట్రంలో వరుసగా 5 రోజుల పాటు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలుల వర్షాలు పడుతాయని ప్రకటించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ బంగాళాఖాతం, సరిహద్దు వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిషా తీర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 7.6 కిలో మీటర్ల ఎత్తులో ఉపరిత ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో వరుసగా 5 రోజుల పాటు వానలు కురుస్తాయని ప్రకటించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఇవాళ వానలు ఎక్కడ కుస్తాయంటే?

సోమవారం(జూన్ 23) నాడు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, హైదరాబాద్‌, నాగర్‌ కర్నూల్‌, నల్లగొండడ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

ఈ నెల 24న ఈ జిల్లాలో వర్షాలు

మంగళవారం(జూన్ 24) రోజున ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, రంగారెడ్డి, మేడ్చల్‌, హైదరాబాద్‌, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటిచింది.

ఈ నెల 25న వానలు కురిసే జిల్లాలు ఇవే!

ఇక బుధవారం(జూన్ 25) నాడు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడుతాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అటు ఈదురుగాలులకు తోడు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Read Also: తెలంగాణలో 78,842 రేషన్ కార్డులు రద్దు!.. ఎందుకో తెలుసా?

Back to top button