
క్రైమ్ మిర్రర్, శంకర్ పల్లి :-నిరుపేదలకు వలస కూలీలకు అన్నదానం చేయడం ఎంతో సంతృప్తినిస్తుందని శంకర్పల్లి సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్ నరేష్ కుమార్ పేర్కొన్నారు. అక్షయ తృతీయ సందర్భంగా బుధవారం రాత్రి శంకర్ పల్లి సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు, వలస కూలీలకు, రైల్వే స్టేషన్ అనాథలకు, భోజనంతోపాటు మామిడిపండ్లను అందించడం జరిగింది. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ సేవా ఫౌండేషన్ శ్రేయోభిలాషులైన శివ అశ్విని మరియు విష్ణు ఈ ఆహారాన్ని ఇవ్వడం వారి మానవత్వాన్ని చాటుతు ఉందన్నారు. ఆకలితో బాధపడుతున్న వారికి ప్రతి ఒక్కరు తమకు నచ్చిన విధంగా కార్యక్రమాలు చేయాలని నరేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు జయరాం రెడ్డి, సే ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి వివేంద్ర చారి, సభ్యులు రాజు, కరాటే రవి, టీచర్ ఉదయ్ కిరణ్, వెంకట్ రెడ్డి, అశ్విని, విష్ణు తదితరులు పాల్గొన్నారు.
పసలేదు కేసీఆర్ ప్రసంగం ఆత్మస్తుతి, పరనింద… కాంగ్రెస్‌పై దుమ్మెత్తి పోయడానికే సభ?