
R K Singh: బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పార్టీ నియమాలను ఉల్లంఘించి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆర్ కే సింగ్‌ను అధికార పార్టీ నుండి బహిష్కరించడం పెద్ద చర్చనీయాంశమైంది. ఎన్నికల సమయంలో పార్టీ అధికారిక అభ్యర్థులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం, నేర చరిత్ర కలిగిన నాయకులను తిరస్కరించాలని ప్రజలకు పిలుపునివ్వడం వంటి చర్యలు పార్టీ నిర్ణయానికి ప్రధాన కారణాలుగా వెల్లడించారు.
అంతేకాక, ఎమ్మెల్సీ అశోక్ కుమార్ అగర్వాల్, అతని భార్య కతిహార్ మేయర్ ఉషా అగర్వాల్‌ను కూడా ఇలాంటి చర్యలకుగాను సస్పెండ్ చేశారు. అశోక్ అగర్వాల్ తన కుమారుడిని ప్రతిపక్ష కూటమి అభ్యర్థిగా నిలబెట్టడం పార్టీ వ్యతిరేకతకు ప్రత్యక్ష నిదర్శనమై, బహిష్కరణను మరింత వేగవంతం చేసింది. ఈ పరిణామాలతో బిహార్ రాజకీయాలు మరోసారి వేడి పుట్టించాయి.
ALSO READ: Ayodhya: రామాలయంపై పతాక ఆవిష్కరణకు సిద్ధమైన అయోధ్య





