
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి*
జయశంకర్ జిల్లా మహదేవ్పూర్ మండలం కాలేశ్వరంలో
రాబోయే గురువారం నుంచి ప్రారంభమయ్యే సరస్వతీ పుష్కరాల పనులను మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సోమవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరస్వతి పుష్కరాల పనుల ఏర్పాటుకై కోట్ల రూపాయలను మంజూరు చేసినప్పటికీ పనులు మాత్రం అసంపూర్తిగానే ఉన్నాయని అధికారుల తీరుపై మండిపడ్డారు. ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ ఇద్దరూ కలిసి పనులను పర్యవేక్షించినప్పటికీ పనులు మాత్రం అసంపూర్తిగానే ఉండడం విడ్డూరమన్నారు. పనులు మొత్తం పూర్తయ్యాయని చెప్పడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తిస్థాయిలో తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సరస్వతి పుష్కరాలను నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడిన అధికారులను అడ్డుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
రుషికొండ ప్యాలెస్‌కు మించి – అమరావతిలో ఇంద్రభవనం – వేరే లెవల్
పరకాల క్రికెట్ టోర్నమెంట్ 2025.. ముఖ్య అతిథిగా చందుపట్ల రాజిరెడ్డి