
క్రైమ్ మిర్రర్, పులివెందుల:- జగన్ అడ్డా అయినటువంటి పులివెందుల.. నేడు టీడీపీ అడ్డాగా మారిపోయింది. ఎంతో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో జరిగినటువంటి పులివెందుల జడ్పిటిసి ఎన్నికల ఫలితాలు నేడు విడుదలయ్యాయి. మొదటగా హోరాహోరీగా పోటీ జరుగుతుంది అని నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరు కూడా భావించగా… చివరికి టీడీపీ గణ విజయాన్ని సాధించింది. టీడీపీ తరఫున పోటీ చేసిన లతారెడ్డి ఏకంగా వైసీపీ అభ్యర్థి అయినటువంటి హేమంత్ రెడ్డి పై 6,052 ఓట్ల మెజారిటీతో ఘనవిజయాన్ని సాధించారు. ఈ zptc ఎన్నికలలో భాగంగా టీడీపీ కి మొత్తం గా 6735 ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. దీంతో పులివెందుల గడ్డమీద మొదటిసారిగా వైసిపి డిపాజిట్ కోల్పోయింది.
Read also : కీసరలో ఒక్కసారిగా మెడికల్ షాపులు మూత.. అసలు విషయం తెలిసి షాక్ అయిన ప్రజలు?
పులివెందుల గడ్డమీద మొత్తంగా 10601 ఓట్లు ఉండగా 7814 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టిడిపికి 6735, వైసీపీకి 683 ఓట్లు పడ్డాయి. దీంతో భారీ తేడాతో టీడీపీ పులివెందుల గడ్డమీద విజయకేతనాన్ని ఎగరవేసింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత పులివెందులలో జడ్పిటిసి స్థానం టీడీపీ వశం అయింది. 2016 కంటే ముందు కూడా ఐదు సార్లు వైఎస్సార్సీపీ ఫ్యామిలీ నిలబెట్టిన అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వచ్చారు. ఇక ఈసారి ఇరు పార్టీలు కూడా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నిక ఒక మినీ యుద్ధాన్ని తలపించింది అనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. గొడవలు మొదలుకొని అరెస్టులు దాకా ఎన్నికలలో ఎన్నో వింతలు జరిగాయి. ఎలక్షన్ల ముందు ఇరు పార్టీలు కూడా పెద్ద పెద్ద ప్లాన్లు వేసిన చివరికి టీడీపీ నే విజయాన్ని అందుకుంది. దీంతో పులివెందులలో టీడీపీ విజయాన్ని రాష్ట్రవ్యాప్తంగా టటీడీపీ నాయకులు అలాగే కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
Read also : కాంగ్రెస్ పార్టీలో చేరిన మధుసూదనుడు!