ఆంధ్ర ప్రదేశ్

చరణ్ సినిమా ఈవెంట్ కు డిప్యూటీ CM ను ఆహ్వానించిన దిల్ రాజ్!..

క్రైమ్ మిర్రర్ : మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు శంకర్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి గేమ్ చేంజెర్ సినిమా భారీ అంచనాలను పెంచుతుంది. తాజాగా గేమ్ చేంజర్ సినిమా నిర్మాత దిల్ రాజ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిశారు. జనవరి 4 లేదా 5వ తారీఖున జరిగే గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు రావాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కోరారు.

Also Read : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. అల్లు అర్జున్ రెగ్యలర్ బెయిల్ పిటీషన్ పై తీర్పు వాయిదా

అయితే పవన్ కళ్యాణ్ తన నిర్ణయం చెప్పగానే వేదికను సినిమా యూనిట్ ఖరారు చేస్తుంది అని తెలిపారు. అయితే గేమ్ చేజర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను విజయవాడ లేదా రాజమండ్రి ప్రాంతాలలో నిర్వహించాలని చిత్ర యూనిట్ మరియు దిల్ రాజ్ పవన్ కళ్యాణ్ కు వివరించారు. వీటితో పాటుగానే పవన్ కళ్యాణ్ భేటీ లో దిల్ రాజ్ బెనిఫిట్ షో లు మరియు టికెట్ల రేట్ల పెంపుపై చర్చించినట్లుగా సమాచారం అందింది.

Read Also : 12 సంవత్సరాల తర్వాత… బాక్సింగ్ డే టెస్ట్‌లో టీమిండియాపై ఆస్ట్రేలియా విజయం

అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 రిలీజ్ లో భాగంగా తొక్కిసులాట కారణంగా సంధ్య థియేటర్లో ఒక మహిళ చనిపోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బెనిఫిట్ షోలు మరియు టికెట్ల పెంపు అసాధ్యమని తేల్చి చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఆంధ్రప్రదేశ్లో గేమ్ చేంజెస్ సినిమా యొక్క టికెట్లు రేట్లు మరియు బెన్ఫిట్ షోలకు అనుమతులు ఇస్తారో లేదో వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి : 

  1. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకండి.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు సజ్జనార్ సూచన
  2. పదవులకే వన్నే తెచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్.. సీఎం రేవంత్ రెడ్డి
  3. తొలిసారి టైటిల్ గెలిచిన హర్యానా!… ఎట్టకేలకు నెరవేరిన కోచ్ కళ?
  4. తెలంగాణ పోలీస్ కొత్త లోగో.. విడుదల చేసిన తెలంగాణ పోలీసులు
  5. మన్మోహన్ కు భారతరత్న ఇవ్వడంపై పూర్తిగా మద్దతు తెలుపుతాం: కేటీఆర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button