ప్రో కబడ్డీ లీగ్ 2024వ సంవత్సరం కు గాను ఇవాళ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. హర్యానా స్టీలర్స్ మరియు పట్న పైరేట్స్ ఇవాళ తలపడుతున్నాయి. ఇవాళ రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఒకవైపు పట్న పైరేట్స్ మూడుసార్లు విజేత నుంచి నాలుగవసారి టైటిల్ కొట్టాలనే ఉత్సాహంతో ఫైనల్ బరిలోకి దిగునుంది. ఇక మరోవైపు పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న హర్యానా స్టీలర్స్ మొట్టమొదటిసారిగా ఎలాగైనా కప్పు కొట్టాలనే కసితో ఉన్నారు.
హాఫ్ సెంచరీకి పుష్ప!… సెంచరీకి ఇంటర్నేషనల్ పుష్ప?
కాగా లీగ్ మ్యాచ్లలో ఒక బెంగుళూరు మరియు బెంగాల్, గుజరాత్ టైటాన్స్, తమిళ్ తలైవాస్ టీమ్స్ మినహా అన్ని టీములు కూడా బాగానే ఆడాయి. హర్యానా స్టీలర్స్, యుముంబా, పాట్నా పైరేట్స్, దబాంగ్ ఢిల్లీ, యూపీ యోధ, జైపూర్ పింక యాంకర్స్ ఈ 6 టీములు ప్లే ఆప్స్ కి క్వాలిఫై అయ్యాయి.
లంచంతో ఏసీబీకి పట్టుబడ్డ డిప్యుటీ తహసీల్దార్
ఎంతో ఉత్కంఠంగా జరిగినటువంటి క్వాలిఫై మ్యాచ్స్ లో పట్నా మరియు హర్యానా స్టీలర్స్ ఫైనల్స్ కు చేరుకున్నాయి. కాగా ఇవాళ రాత్రి 8 గంటలకు వీళ్లిద్దరి మధ్య హోరాహోరీగా ఫైనల్స్ జరుగునున్నాయి. డిస్నీ హాట్స్టార్ లో ప్రత్యక్ష ప్రసారంగా లైవ్ ను చూడవచ్చు. దీంతో మొట్టమొదటిసారిగా ఎలాగైనా కప్పు కొట్టాలనే కసితో హర్యానా స్టీలర్స్, కప్పు ఏమి మాకు కొత్త కాదంటూ పట్న పైరేట్స్ రెండు టీములు కూడా గెలుస్తామన్న ధీమాతో ఉన్నాయి.