
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మొన్న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోవడానికి ముఖ్య కారణాలు చాలా ఉన్నాయని జన సూరజ్ పార్టీ చీఫ్, ఎన్నికల వ్యూహ కర్తగా పేరు పొందిన ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యం పాలసీ కేసులో బెయిల్ పొందిన తరువాత అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం అనేది అతి పెద్ద తప్పు అని చెప్పుకొచ్చారు. కేజ్రీవాల్ ఎప్పుడైతే రాజీనామా చేశాడో అప్పుడే ఢిల్లీ ప్రజల్లో కేజ్రీవాల్ నేరగాడుగా ముద్ర పడిపోయిందని అన్నారు.
జన సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ తాజాగా ఈ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలో ఆప్ పార్టీ ఓడిపోవడానికి గల కారణాలను తెలియజేశాడు. మరి ముఖ్యంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆఫ్ ఓటమికి పది సంవత్సరాల ప్రభుత్వ వ్యతిరేకతనే మొదటి కారణంగా తెలిపారు. ఆ తర్వాత మద్యం పాలసీ కేసులో అరెస్టు అయినప్పుడు ఆయన పదవి నుంచి తప్పుకోకుండా బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. అంతటితో ఆగకుండా మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు ఉన్నాయని తెలిసినా కూడా వేరే ముఖ్యమంత్రి నియమించడం అనేది పెద్దతప్పిదమని తెలిపారు.
అంతేకాకుండా ఎన్నికల సమయంలో ఆప్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్లకుండా కేవలం ఆప్ పార్టీ మాత్రమే విడివిడిగా ఎన్నికలకు బయలుదేరింది. ఇది ఆ పార్టీ పనితీరుపై చాలా ప్రభావం చూపిందని అన్నారు. అంతేకాకుండా ఢిల్లీలో ప్రజలు ఎత్తి చూపించిన పనులను కేజ్రీవాల్ సరిగా పట్టించుకోలేదు. కానీ ప్రస్తుతం ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బిజెపి గెలవడంతో ఇక ఆకు పార్టీ పూర్తిగా పక్కకు తోలుకుతుందని అందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
ముస్లిం సభకు వెళ్లినందుకే రంగరాజన్ పై దాడి చేశారా?
సినిమాను పైరసీ చేసిన వాళ్ళని వదిలిపెట్టం: తండేల్ మూవీ నిర్మాత