ఆంధ్ర ప్రదేశ్

ఆయనకు ఎవరైనా చెప్పండయా.. పవన్ పై ప్రకాష్ రాజ్ సెటైర్లు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, హీరో ప్రకాశ్ రాజ్ మధ్య మళ్లీ వార్ మొదలైంది. సెటైర్లు,కౌంటర్లతో ఇద్దరు హీరోలు కాక రేపుతున్నారు. చాలా కాలంతా మౌనంగా ఉన్న ప్రకాశ్ రాజ్.. తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ హిందీపై చేసిన వ్యాఖ్యలకు తన ఎక్స్ లో కౌంటర్ ఇచ్చారు. మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదని చెప్పారు. స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం అన్నారు. పవన్ కళ్యాణ్ కు ఈ విషయం ఎవరైనా చెప్పండి ప్లీజ్ జస్ట్ ఆస్కింగ్ అని అని ప్రకాశ్ రాజ్ తన ఎక్స్ పోస్టులో తెలిపారు.

పిఠాపురం నియోజికవర్గంలోని చిత్రాడలో జనసేన 11వ ఆవిర్భావ సభలో ఉద్వేగంగా ప్రసంగించారు పవన్ కల్యాణ.త్రిభాషా విధానంపై తన వైఖరి చెప్పారు. ప్రస్తుతం కొందరు హిందీ భాషపై గగ్గోలు పెడుతున్నారంటూ.. తమిళనాడు సీఎం స్టాలిన్ ను పరోక్షంగా టార్గెట్ చేశారు. అలా అయితే తమిళ సినిమాలు హిందీలో డబ్ చేయొద్దన్నారు. హిందీ భాష వద్దు కానీ..వాళ్ల డబ్బులు కావాలా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు పవన్. భారతదేశానికి బహుభాషా విధానమే మంచిది అని.. తమిళనాడు సహా అన్ని రాష్ట్రాలకు ఒకే సిద్ధాంతం ఉండాలన్నారు . దేశ ఐక్యత కోసం బహుభాషా విధానం ఉండాలని జనసేనాని స్పష్టం చేశారు.

Read More : ఇళ్ల నుంచి బయటికి వస్తే డేంజర్.. డేంజర్ బెల్స్

రూపాయి సింబల్ మార్చడమేంటని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను ప్రశ్నించారు పవన్ కల్యాణ్. త్రిభాషా సూత్రంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న క్రమంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవల తిరుమల లడ్డూ,సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ప్రకాశ్ రాజ్ కౌంటర్ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button