
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :-
సరోజా దేవి… తెలుగు, కన్నడ మరియు తమిళ భాషల్లో నటించిన ప్రముఖ నటి, పద్మ భూషణ్ అవార్డు పొందినటువంటి బి సరోజా దేవి నిన్న అనారోగ్య కారణంతో తుది శ్వాస విడిచారు. అయితే సరోజా దేవి మరణించిన అనంతరం ఇద్దరికీ చూపునివ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో ఆమె ఒక ఆసుపత్రిని సందర్శించిన సమయంలో నేను చనిపోతే నా కళ్ళు ఇతరులకు పెట్టాలని.. బెంగళూరు లోని నారాయణ నేత్రాలయ వైద్యులకు తెలిపారట. అయితే ఆమె కోరిక మేరకు నారాయణ నేత్రాలు ఏ వైద్యులు చనిపోయిన అనంతరం ఆమె కార్నియా తీసి భద్రపరిచారు. త్వరలోనే ఆమె ఆమె కళ్ళను ఇతరులకు అమర్చుతామని బెంగళూరుకు చెందిన నారాయణ నేత్రాలయ వైద్యులు తెలిపారు. దీంతో అన్ని రంగాల సినిమా ఇండస్ట్రీ తరుపు నుంచి సరోజా దేవి మంచి మనసుపై ప్రశంసలు వెలువడుతున్నాయి.
అలనాటి ప్రముఖ నటి అయినటువంటి సరోజా దేవి… తెలుగులో, కన్నడ మరియు తమిళ భాషల్లో ఉన్నటువంటి ఎన్టీఆర్, ANR, MGR లాంటి పెద్ద హీరోలతో కలిసి నటించిన సందర్భాలు చాలా ఉన్నాయి. 1955లో ‘మహాకవి కాళిదాస’ అనే కన్నడ మూవీ తో సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన సరోజ దేవి ఎంతోమంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. ఇక తెలుగులో ఇంటికి దీపం ఇల్లాలే, మంచి చెడు, దాగుడుమూతలు, పండంటి కాపురం, దానవీరశూరకర్ణ, అల్లుడి దిద్దిన కాపురం వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అయితే ఆమె మరణించిన అనంతరం కళ్ళను దానం చేయడం… ప్రతి ఒక్కరిని కూడా కలిచివేసింది. దీంతో సరోజా దేవి పై ప్రశంసలు వెలువడుతున్నాయి.
బ్రిటన్ రాజు నివాసంలో ఇండియన్ క్రికెట్ టీమ్స్ సందడి
ఏపీలో సెగ పుట్టిస్తున్న రాజకీయాలు.. సీఎంకు వార్నింగ్ ఇచ్చిన మాజీ సీఎం!