
తెలంగాణలో సంచలనం స్పష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు.ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు ప్రభాకర్ రావు. తనకు 65 ఏళ్ల వయసు ఉందని అనారోగ్యంతో బాధపడుతున్నానని పిటిషన్ లో పేర్కొన్నారు.
తాను వైద్యం కోసమే అమెరికా వెళ్ళినట్టు నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశానని హైకోర్టుకు తెలిపారు ప్రభాకర్ రావు.తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు లేవని స్పష్టం చేశారు. అమెరికా వెళ్ళిన దర్యాప్తు అధికారితో టచ్ లో ఉన్నాను అంటున్నారు ప్రభాకర్ రావు.ఈ కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు కాబట్టి తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు ప్రభాకర్ రావు..
కేసు దర్యాప్తుకు పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని హైకోర్టుకు తెలిపారు ప్రభాకర్ రావు.