
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళి తాజాగా జైలు నుంచి బెయిల్ మీద విడుదలయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తో పాటుగా పవన్ కళ్యాణ్ పై గతంలో అంచుత వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై చాలా కేసులు నమోదయ్యాయి. అయితే గత నెలలో ప్రకాశం జిల్లా పోలీసులు హైదరాబాద్ వెళ్లి మరి పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేయడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా పోసానిపై 17 కేసులు నమోదయాయని పోలీసులు తెలిపారు. అయితే ఎట్టకేలకు నిన్న పోసానికి బెయిల్ లభించింది. నిన్న గుంటూరులోని సిఐడి కోర్టు కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు మంజూరు చేసింది.
మొదటి మ్యాచ్ లోనే ఘన విజయం … కోహ్లీ మరో రికార్డు!
అయితే జైలు నుంచి వెంటనే బయటకు వచ్చిన పోసాని చాలా బాగోద్వేగానికి గురయ్యారు. కన్నీటితో బయటకు వచ్చిన పోసాని అంబటి రాంబాబుని చూసి మరింత బాగోద్వేగానికి లోనయ్యారు. కాగా పోసాని కృష్ణ మురళి వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసిపి పార్టీకి చాలా దూకుడుగా ఉండేవారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చాలా బలమైన మద్దతుదారుడుగా నిలిచేవారు. అయితే గతంలో వైసిపి పార్టీ అధికారంలో ఉందని ప్రతిపక్ష పార్టీ నేతలపై బూతులతో… ఎలా పడితే అలా ప్రెస్మీట్లో మాట్లాడేసరికి ఇవాళ అతనిపై చాలామంది కంప్లైంట్స్ ఇస్తూ కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే అరెస్టు అయ్యి దాదాపు నెలరోజుల పాటుగా జైలు జీవితం గడిపారు.
ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు
రాజకీయం గురించి మాట్లాడుతుంటే మీరేంట్రా OG… OG అంటారు: పవన్ కళ్యాణ్