* ప్రసిద్ధ ఆంగ్ల కవులను మించిన రచనలు
* ‘ఇండియన్ సోనెటీర్’ పేరుతో 200 సోనెట్ల సంకలనం
* భారతీయ, ఆంగ్ల కవులు చేరుకోలేని స్థాయిలో రచనలు
ప్రముఖ తెలుగు కవి, బహుషావేత్త వెంకట్ పూలబాల. ఈయన పేరు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, ఎంతో మంది భారతీయ, విదేశీ విద్యార్థులకు బహు భాషలో బోధిస్తున్నారు. బహు భాషావేత్తలుగా తీర్చిదిద్దుతున్నారు. తెలుగు కవులే కాదు, ప్రసిద్ధ ఆంగ్ల కవులకు కూడా సాధ్యంకాని రీతిలో అద్భుతమైన రచనలు చేశారు. షేక్ స్పియర్, జాన్ కీట్స్, ఎడ్మండ్ స్పెన్సర్ లాంటి దిగ్గజ కవులను మించి సొనెట్స్ రాశారు. షేక్ స్పియర్ 154 సొనెట్స్, జాన్ కీట్స్ 67 సొనెట్స్, ఎడ్మండ్ స్పెన్సర్ 89 సొనెట్స్ రాయగా, పూలబాల ఏకంగా 200 సొనెట్స్ రాశారు. ఆంగ్ల చందస్సుని నియమాలని పాటిస్తూ ఆయన రాసిన ‘ఇండియన్ సోనెటీర్’ ఓ గొప్ప అందమైన ఆంగ్లకవితా శిల్పం. ఈ 200 పద్యాలు 20 వర్ణాల కాంతులీనే మణుల్లాంటిది. కవి పుంగవులు మెచ్చిన కవితా గనులుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. ఈ 200 పద్యాలను భావానుగుణంగా 20 భాగాలగా విభజించి రచించారు. ప్రతి భాగం లోనూ 10 పద్యాలు ఉన్నాయి.
ఏ భాగంలో ఏ పద్యాలు ఉన్నాయంటే?
⦿ మొదటి భాగంలో జీవితానికి స్పూర్తి నిచ్చే అడోరబుల్ ఇందులో డిజైర్ డెత్, డ్రీమ్స్, ప్రోబ్లమ్స్ వంటి పద్యాల జీవిత పోరాటంలో విసుగుచెందకూడదని అపజజాలకు కుంగిపోకూడదనే భావాలను హృద్యంగా పలికిస్తాయి.
⦿ 2 భాగం రొమాంటిక్ కోవకు చెందినది. ఇందులో Love on Train, Silver Fish, Happy birds , Flower of Love , Honey moon వంటి సున్నిత శృంగార పరిమళాలనొలికిస్తాయి.
⦿ 3 వ భాగం కింగ్స్ అండ్ బేటిల్స్: పల్లవులు, చోళులు, కలింగులు, కంబల్ ఘర్ ఫోర్ట్, విజయనగరం ఫోర్టు, రెడ్ ఫోర్ట్. బేటిల్ ఆఫ్ పద్మనాభం, అనే చరిత్ర మట్టిలో లోకప్పబడిన అనేక విషయాలని కోటల కట్టాడాలని యుద్దాలని తవ్వితీసేభాగం.
⦿ 4 భాగం పాషన్ అంటే మోహం. భారతీయ పురాణ సాహిత్యం లో శకుంతల విశ్వామిత్రుడు గ్రీకు సాహిత్యం లో లిడా, (హంస – దేవా గురువు జియస్ ) వంటి వారి మొహాల్ని ఇందులో వర్లిస్తారు. మోహాన్ని దాటడం చాలా కష్టం అని చెప్పే భాగం ఇది. ‘అదుల్తేరియో’ నవల కథా సంగ్రహాన్ని మొత్తం ఒక పద్యంగా ‘ఓడ్ టు పాషన్’ అనే ఓడ్ లో రాస్తారు. తన జీవితంలో చూసిన అందమైన స్త్రీ మీద తన అభిమాన పాఠకురాలు పై రాసిన ‘ఓడ్ టు హర్ డివైన్ బ్యూటీ’ కూడా ఈ భాగంలో కనిపిస్తాయి.
⦿ 5వ భాగం లౌ ఫిలాసఫీ : ఇందులో పద్యాలు హేతువాదంతో ప్రేమతత్వాన్ని విశ్లేషిస్తాయి నో లౌఈజ్ ఫిలసాఫికల్ అనే పద్యంలో ప్రేమ భౌతిక మైనది శారీరక మైనదని అద్భుతమైన విశ్లేషణ ప్రాసలతో రాశారు. హార్డ్ అండ్ మైండ్ అనే పద్యం లో చిన్న చిన్న పదాలలో పదబంధాలతో ప్రాసతో శబ్దం వీనులవిందుగా భావం మనసుకి హత్తుకునే లా రాశారు.
⦿ 6వ భాగం ఎరోటికా లో లస్ట్( కామం ) అనే పద్యం తో మొదలెడతారు. కామం గొప్పతాన్ని అత్యద్భుతం గా వర్లించిన పద్యాలు కొన్ని ఉంటే అందులో ఈ పద్యం అగ్రస్తానం లో ఉంటుంది. రతి జీవన గతి అని జీవిత నౌకకు చుక్కాని అని గౌరవ స్తానం రతికి ఇచ్చి అంజంతా ఎల్లోరా విరూపాక్ష రతీభంగిమలు కనిపించేలా చూపుతారు. ఎరోటికా అంటే రతి శిల్పం.
⦿ 7వ భాగం రొమాన్స్ లో మరిగిన మనసుని ఈ భాగంలో నైట్స్ సాంగ్స్ తో చల్లబరుస్తారు. రాత్రి అందాలను వర్ణిస్తూ డార్క్ నెస్ అనే పద్యంలో లో చీకటిని చదువరికి పూస్తాడు. నైట్స్ సాంగ్స్ చదువుతున్నప్పుడు నిశ్శబ్ద రాత్రిలో మనం నడుస్తున్న ట్టుంటుంది.
⦿ 8వ భాగం ‘హార్ప్ స్ట్రింగ్స్’ లో తన ఊహలను విచిత్ర అనుభవాలను హృద్యంగా తన అపార్ట్ మెంటలో శబ్దాలకి కారణం దెయ్యం ఉందని అపార్ట్ మెంటు వాళ్ళు కాపలా ఎలా కాసారో మంచి లయతో హాస్యంగా వర్ణిస్తారు. వింటర్ మోర్నింగ్ రైడ్ అనే పద్యం లో పొగ మంచు తెరలో తన మోటార్ సైకిల్ ప్రయాణాన్ని ప్రకృతి సౌందర్యాలని వర్ణిస్తారు.
⦿ 9వ భాగం కలర్స్ ఆఫ్ ద అర్త్ ఇందులో భూమి ఆభరణాల వర్లన చాలా సున్నితంగా ఉంటుంది. కొండలు పర్వతాలు కిరీటాలు నదులు జలపాతాలు. కంఠాభర ణాలు మొక్కలు వృక్షాలు శిరోజాలు ఇలా మేటి సృజనాత్మకతతో మది పులకించే పోలికలతో భావ ఆభరణా లను పుడమికి చక్కగా అమర్చేరు. పద్యాల పేర్లన్నీ జంటపదాలే Hills and Mountains, Rivers and Fountains, Trees and Plants, Seas and Oceans, the Sun and the Moon అని రాసాడు. ఈ భాగాన్ని I am the earth, my heroine అనే సుదీర్ఘమైన పద్యంతో ముగించారు.
⦿ 10 వ భాగం రాయల్ ఫ్లేమ్స్ అటవీ సంపదను ఎలా దోచుకుంటున్నారో, అటవీ వృసాలను ఎరాచంపు తున్నారో చూపించే ఈ ఖండం ఖండ ఖండాల గా ప్రకృతిని భంజించే ఛండాల మానవ వృత్తిని ప్రవృత్తిని ఎండగట్టే భాగం. ఇందులో ఆవు, చీమ, ఏనుగు, నది లాంటి భారతీయ మనోభావాలను చూపే పద్యాలు ఉన్నాయి.
⦿ 11వ భాగం గ్రేవ్ యార్డ్ పోయెట్రీ. అంటే హరిశ్చంద్రుడి కాటి పద్యాల్లా అన్నమాట. 18వ శతాబ్దంలో ఒక చిన్న ఇంగ్లీష్ కవులు సమూహము పేరు గ్రేవీ యార్డ్ పోయెట్స్. మృత్యువు వైరాగ్యం ఇందులో ప్రధాన ఇతివృత్తాలు.
⦿12వ భాగం లో సోలిటరీ పోయెట్ అనే పద్యం కాటి దృశ్యాన్ని కళ్లకు చూపిస్తుంది. ఇందులో ఫేట్స్ పప్పెట్ అర్జెంట్ ఫేర్ వెల్ , ఎమ్టీనెస్ జర్నీ లాంటి విషాద మైన పద్యాలున్నాయి.
⦿ 13వ భాగం అంతా ఆశ Hope of Love అని ఒక ఆశా శ్రేణి పద్యాలు రాసేరు. ఆ పక్కనే నిరాశ వాదం చూపిస్తారు. జీవిత మంటే వెలుగు నీడలు ఆశనిరాశల కలయికేదా అంటారు.
⦿ 14వ భాగం ఫ్రీడం అంటే స్వేచ్చ గురించిన పద్యాలు. ఫ్రీడం ఆఫ్టర్ మ్యారేజ్ , డేడ్రీమ్ , slavery comes in disguise. చదువు తుంటే పెళ్ళి మీద తిరుగుబాటు పద్యాలని అని పిస్తుంది. హాస్య ధోరిణి లో అందమైన పదాలతో అలంకారాలతో స్వేచ్చ ప్రాముఖ్యతను గుర్తుండి పోయేలా చెప్పారు.. అంటే స్వేచ్చ జీవితానికి గొప్పశక్తి అన్నాడు ఫ్రీడం ఈజ్ హెవెన్ స్పిరుట్యువల్ ఫ్రీడం పద్యాలతో ఈ భాగం ముగుస్తుంది.
⦿ 15వ “After 13 years” ఈ భాగంలో ఢిల్లీలో తనకి ఆధ్యాత్మిక గురువైన ఒక ఢిల్లీ స్నేహితుడు 13 సంవత్సరాల తర్వాత విజయవాడ వస్తున్నాడు అని తెలిసినప్పటి నుంచి విజయవాడ రైల్వే స్టేషన్ లో విజయవాడ రైల్వేస్టేషన్ ప్లాట్ఫారం మీదకు వచ్చే ట్రైన్ కోసం వెతుకులాట ఎదురుచూపులు స్నేహితుడిని కలవడం వరకు తను మనోభావాల్ని ఇవన్నీ సోనిట్ల రూపంలో రాశారు. 13 సంవత్సరాల తర్వాత స్నేహితుని కలిసినందుకు ఆనందపడి 13 సోనిట్ల రూపంలో అతనితో తనకు గల అనుబంధాన్ని వర్ణించాడు.
⦿ 16 వ భాగం మర్మసింగ్ పామ్స్ : పదో శతాబ్దపు కాశ్మీర్ రాణి దిద్దా, 17వ శతాబ్దపు ఢిల్లీ రాణి రజియా సుల్తానా, 17 వ శతాబ్దపు రష్యన్ రాణి కేథరీన్, ఫ్రెంచ్ రాణి ఆంత్వా నెత్ అనేకమంది పురుషులతో విలాస స్త్రీలుగా పేరు పడ్డారు. అటువంటి మార్కండ్ రాణి భయానక కల్పిత కథను సోనెట్స్ రూపంలో వెన్నులోంచి చలిపుట్టేలా చెప్తారు. మార్కండ్ లో రత్న ఘర్ కోట లో రాణి అందమైన పండితుణ్ణి చూసి మోహించి దక్కకపోడం తో నింద వేస్తుంది. అది భరించలేక ఆ పండితుడు ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. అతడి శాపానికి గురైన కోట భూత గృహంగా మారిపోతుంది. ఊరంతా శ్మశానంగా మారిపోతుంది. అక్కడున్న తాటి చెట్టు రివ్వున వీసే గాలీ ఆకథలను పాడుతుంటాయి. 15 వ భాగం పూర్తిగా వాస్తవం దానికి విరుద్దంగా పూర్తిగా కల్పితమైన 16 వ భాగాన్ని రాసారు.
⦿ 17 వ భాగం చెర్రీ బ్లోసమ్స్ . ఇందులో రైళ్లను రాణులతో పోల్చి , వాటికోసం అందరూ ఎదురుచూడాల్సిందే అని వాటి హుందాతనాన్ని వర్ణిస్తారు. రైలు నడక , పరుగు , కిటికీలోంచి కనిపించే ప్రకృతి మాత్రమే కాక రాల్లో మనుషుల ప్రకృతి కూడా వర్ణిస్తారు. సామాన్య ఊహకి అందని ఇమేజరీ మనసులని కవితా ఘరిలో తడిపేస్తుంది.
⦿ 18 వ భాగం వైల్డ్ థాట్స్ లో మొదటి పద్యం లోనే అమోఘమైన భావనలు పతాకస్థాయి వర్ణనలు చూపిస్తారు. ఇందులో బర్న్ ది ఫెర్న్ ఐ ఫ్ అనే పద్యాలు జాతీయ భావాలని దేశం పట్ల కవికి గల ప్రేమని తెలియజేస్తాయి.
⦿19 వ భాగం కవి బాల్యం చిన్ననాటి అనుభవాలు. పద్యాలలో ప్రాసకంటే ఇమేజరీ కి ప్రాముఖ్యతనిచ్చి , తీపిగురుతులను వెనక్కితోడుతారు. ఆ కాలానికి చెందిన వస్తువులు డయోనారా టీవీ, మర్రి చెట్టు , పిల్లల ఆటలు అప్పటి నాగరికత ను కళ్లకుకట్టినట్టు వర్ణించడం వల్ల ఈ పద్యాలు చదువరులు అందరినీ ఆకట్టుకుంటాయి.
⦿ 20 వ భాగం ఎన్లైటెన్మెంట్ పద్యాలు. 200వ పద్యం ఫ్రెండ్ . ఇందులో కవి స్నేహం అనే మాటని వ్యంగ్యంగా ప్రయోగించి మతాల మధ్య చిచ్చు ఉండకూడదని భావిస్తారు. ఇందులో హిట్లర్, బుద్ధుడు , వేశ్య , మతాలూ, మానవత్వం , ప్రపంచ చరిత్ర వంటివి వస్తువులు ఉన్నాయి. కవి ఈ విషయాలను మానవత్వం కోణంలో పరిశీలించమంటాడు.
తెలుగువాడు అయినందుకే గుర్తింపు రాలేదా?
200 అంకెలు వేయడానికి ఎంత ఓర్పు అవసరమో మనకి తెలుసు. రెండు వందల పద్యాలు రాయడానికి ఎన్ని పదాలు కావాలి, ఎన్ని భావాలు కావలి, ఎంత ఓర్పు కావాలి ? భాషమీద ఎంత పట్టు ఉండాలి ఎంత పట్టుదల ఉండాలి ఎంత ప్లానింగ్ ఉండాలి. కొన్ని పద్యాలను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని అనుభవజ్ఞులైన ఇంగ్లిష్ ప్రొఫెసర్స్ తమ ముందుమాటలో తెలియజేశారు. పదజాలంతో భావజాలంలో ఇంగ్లీష్ కవుల కేమాత్రము తగ్గకుండా పూలబాల ప్రయోగించిన వందలాది ప్రాస పదాలు, పదబంధాలు, కొత్త పద ప్రయోగాలు పాఠకులని వేరే ప్రపంచంలోకి తీసుకుపోతాయి. ఇప్పటికే చరిత్రలో అతిపెద్ద సోనెట్ల సంకలనంగా నిలచిన ఇండియన్ సోనెటీర్ క్రమేపి జన హృదయంలో నిలిచి పోతుంది. బహుశ ఆయన విదేశాల్లో పుట్టి ఉంటే, షేక్ స్పియర్, జాన్ కీట్స్, ఎడ్మండ్ స్పెన్సర్ లాంటి అగ్ర కవులను మించిన పేరు ప్రఖ్యాతులు వచ్చి ఉండేవంటున్నారు కవి పండితులు.
