
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఎలా ఉందో తెలుసుకోవాలనే చూడడానికి కెసిఆర్ బయటకు వచ్చాడంటూ మంత్రి శ్రీనివాస్ అన్నారు. అసలు కెసిఆర్ కు అసెంబ్లీకి రావాలనే ఆలోచనే లేదని విమర్శించారు. మరోవైపు సభకు వచ్చిన బిఆర్ఎస్ నేతలు అచ్చం ఆంబోతుల్లా ప్రవర్తించారని తెలిపారు. గతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ చేసిన స్కాంప్లన్నీ కూడా ప్రజలకు చూపిస్తామని తెలిపారు. పాస్పోర్ట్ రెన్యువల్ కు వచ్చి మొఖం చూపించి మళ్లీ వెళ్ళిపోయారని అన్నారు.
కాగా చాలా రోజుల తర్వాత కెసిఆర్ మళ్ళీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అడుగుపెట్టారు. కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా ఇప్పటివరకు కేసీఆర్ పార్టీ వ్యవహారాలను పక్కన పెట్టారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలన్నిటిని కూడా కెసిఆర్ తనయుడు కేటీఆర్ దగ్గర ఉండి చూసుకుంటున్నారు. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలను, అన్యాయాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలలో అలాగే ప్రజలలో జోష్ నింపారు.
ఇవి కూడా చదవండి
1.25 శాతం రాయితీతో ఎల్‌ఆర్‌ఎస్… అక్రమ లే-అవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు అనుమతి
2.బెల్టు షాపులకు మద్యం విక్రయిస్తే చర్యలు:డిఎస్పీ
3. ఫ్యాన్స్ లేక స్టేడియం విలవిల!… మొదటి రోజే పాకిస్తాన్ పై ట్రోలింగ్?