మహబూబ్‌నగర్, క్రైమ్ మిర్రర్: మహబూబ్‌నగర్‌లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇద్దరు ఒకరిపైఒకరు మాటల యుద్దానికి తెరలేపడంతో కార్యకర్తల్లో సైతం కాకా రేపుతోంది. మంత్రి శ్రీహరి, బీజేపీ ఎంపీ డీకే అరుణ మధ్య చోటు చేసుకున్న రాజకీయం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. మహబూబ్‌నగర్‌లో జరిగిన కార్యక్రమం అనంతరం మంత్రి శ్రీహరి ఎంపీ అరుణపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాకు రావాల్సిన ప్రాజెక్టులను అడ్డుకోవడంలో డీకే అరుణది కీలక పాత్ర అని, ఆమె కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే పాకులాడుతున్నారని ఆరోపించారు. కేంద్ర నిధులపై సవాల్: “కేంద్రం నుంచి మహబూబ్‌నగర్‌కు ఎన్ని నిధులు తెచ్చారో శ్వేతపత్రం విడుదల చేయగలరా?” అని మంత్రి సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులకు అడ్డుతగలడం మానుకోవాలని సూచించారు.
శ్రీహరి మాటలు తిప్పికొట్టిన ఎంపీ డీకే అరుణ…
మంత్రి శ్రీహరి చేసిన వాఖ్యల్లో ఎలాంటి నిజం లేదని ఎంపీ డీకే అరుణ ఘాటుగా బదులు ఇచ్చారు. ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమాట్లాడారు. “వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడమే”: ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి తనపై బురద జల్లుతోందని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఆలస్యం చేస్తూ రైతుల పొట్ట కొడుతోంది ప్రభుత్వమేనని ఆమె ఆరోపించారు.
“మంత్రి శ్రీహరి గారు, మీరు నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చి మాట్లాడుతున్నారు. జిల్లా అభివృద్ధి గురించి నాకు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. కేంద్ర నిధుల విషయంలో చర్చకు నేను సిద్ధం, మీరు సిద్ధమా?” అని సవాల్ ప్రతిసవాల్ విసిరారు.ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం, వచ్చే ఎన్నికల్లో ప్రజలే మీకు బుద్ధి చెబుతారని, బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
