
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి అని గౌరవం లేకుండా ఇరుపక్షాల వారు తిట్టుకుంటూనే ఉన్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చారు. అధికారంలో ఉండేది కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే అని… ఆ తర్వాత అధికారంలోకి వచ్చేది మేమే అని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నంతకాలం ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదని… ప్రజల తరఫున ఎప్పుడు కూడా నేను అలాగే మా కార్యకర్తలు అందరూ కూడా పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పుకొచ్చారు. నిత్యం ప్రజల వెంటనే ఉంటూ.. మీ తప్పులను ప్రజల దృష్టికి తీసుకువెళ్తామని. అధికారంలో ఉన్నామని ఏది పడితే అది చేస్తే.. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా, ముఖ్యమంత్రి కి అలాగే అధికారులకు వడ్డీతో సహా చెల్లిస్తామని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కన్ను మూసి తెరిచేలోపే.. ఈ ఐదేళ్ల అధికారపాలన గడిచిపోతుందని.. ఆ తరువాత వచ్చేది కచ్చితంగా వైసీపీ ప్రభుత్వమే అని జగన్ ధీమా వ్యక్తం చేశారు.
తాజాగా కరేడు ప్రాంత ప్రజలతో మాట్లాడిన జగన్ ఆ ప్రాంత ప్రజలపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చి తరిమేయాలని ఈ కూటమి ప్రభుత్వం చూస్తుంది అని వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఇండోసోల్ బాధితులకు వైయస్సార్సీపి పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో నష్టపోయిన రైతులందరినీ కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదుకుంటుందని తెలిపారు. కూటమిపాలనలో అధికారులు కూడా వాళ్లకి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని… వాళ్లందరికీ కూడా వైసీపీ ప్రభుత్వం గట్టి సమాధానం చెబుతుందని తెలియజేశారు.