తెలంగాణ
Trending

బాధితునిపై మద్దూర్ ఎస్సై దాడి… పోలీస్ స్టేషన్ ఎదుట రెండు గంటల పాటు ధర్నా చేసిన పలు సంఘాల నాయకులు!

మద్దూరు, క్రైమ్ మిర్రర్ ప్రతినిధి ,నారాయణపేట జిల్లా
:- మద్దూరు మండల పరిధిలోని అల్లిపూర్ గ్రామానికి చెందిన కావలి ఎల్లప్ప (42) తండ్రి తిమ్మప్ప అనే వ్యక్తిని సోమవారం రోజు కారణం లేకుండా పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి ఎస్సై ఎర్రళ్ళ విజయ్ కుమార్ చితకబాదినట్టు బాధితుడు పోలీస్ స్టేషన్ ముందు రోడ్డు పై కూర్చుని తన కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా నిర్వహించారు.వివరాలలోకి వెళ్తే కావాలి ఎల్లప్ప తండ్రి తిమ్మప్ప అనే వ్యక్తికి అల్లిపూర్ గ్రామంలో నిత్యం కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు.ఎల్లప్ప భార్య గత నాలుగు నెలల క్రితమే మరణించగా, కుటుంబ పోషణ కోసం తనతో పాటు తన తల్లి భీమమ్మ అదే గ్రామంలో ఉన్న పాఠశాలలో గత 10 సంవత్సరాలుగా వివిధ పనులు చేస్తూ (స్కావెంజర్) కుటుంబ పోషణకు సహకరించేది.గత 3 నెల తల్లి భీమమ్మ నెలసరి జీతం రావడంతో రావడంతో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కావాలి ఎల్లప్పకు సమాచారం ఇచ్చి చెక్కును అందజేశారు. పాఠశాల నియమం ప్రకారం ఆ చెక్కుపై పాఠశాల ప్రధానోపాధ్యాయంతో పాటు చైర్మన్ వెంకటమ్మ సంతకం అవసరం వచ్చింది.ఇదే అంశంపై పదేపదే చర్చించగా వెంకటమ్మ మాట్లాడుతూ అల్లిపూర్ మాజీ సర్పంచ్ రమేష్ రెడ్డి నీకు చెక్కు పై సంతకం చేయవద్దని తెలిపినట్టు సమాచారం ఇవ్వడం జరిగిందని ఇదే అంశంపై ఎల్లప్ప పాఠశాలలో ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులతోపాటు అందరి సమక్షంలో పాఠశాల చైర్మన్ వెంకటమ్మను అడగడం జరిగిందని బాధితుడు ఎల్లప్ప తెలిపారు.*అధికార పార్టీ నాయకుడి పోలీసులకు ఫోన్*
అల్లిపూర్ మాజీ సర్పంచ్ రమేష్ రెడ్డి అధికార పార్టీలో కీలకంగా కొనసాగుతున్నారు. నూతనంగా ఏర్పడ్డ కొత్తపల్లి మండలంలో తన చెప్పిందే వేదంగా భావిస్తూ సామాన్య వ్యక్తులపై తన రాజకీయ బలాన్ని చూపిస్తున్నాడని బాధితుడు ఎల్లప్ప ఆలోచిస్తూ రమేష్ రెడ్డి ఎస్ఐ విజయ్ కుమార్ ఫోన్ చేయడం వల్లే కొత్తపల్లి తహశీల్దార్ కార్యాలయం దగ్గర ఉన్న తనను కానిస్టేబుళ్లు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మద్దూరు పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి ఉంచగా ఎస్సై విజయ్ కుమార్ దురుసుగా ప్రవర్తిస్తూ విచక్షణారహితంగా కొట్టినట్టు బాధితుడు ఆరోపించారు.

ఎల్లప్పును కోస్గి పోలీస్ స్టేషన్ కు తరలింపు

మద్దూర్ పోలీస్ స్టేషన్లో తనను కొట్టిన తర్వాత కోస్గి సిఐ సైదులు ముందు బండ బూతులు తిడుతూ అనంతరం పక్క రూములోకి తీసుకెళ్లి విచక్షణారహితంగా కొట్టడం జరిగిందని అలాగే తనను మద్దూర్ పోలీస్ స్టేషన్ నుండి కోస్గి పోలీస్ స్టేషన్కు ఎందుకు తరలించారని మీడియా ముందు లబోదిబోమన్నారు.*మద్దూర్ పోలీస్ స్టేషన్ ముందు బాధిత కుటుంబ సభ్యులు,వివిధ పార్టీ నాయకుల ధర్నా*

సోమవారం రోజు ఎల్లప్పను మద్దూర్ మరియు కోస్గి పోలీస్ స్టేషన్లో కొట్టిన తర్వాత సుమారు రాత్రి 7:30 నిమిషాలకు వదలడం జరిగిందని, తన ఏ కారణం చేత ఎస్సై మరియు పోలీసులు ఈ విధంగా చిత్రహింసాల గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఎల్లప్ప కుటుంబానికి బిజెపి మరియు బిఆర్ఎస్ నాయకులు మద్దతు పలుకుతూ క్రమశిక్షణ రహితంగా ప్రవర్తించిన ఎస్సై విజయ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.

సిఐ సైదులుకు ఎస్ఐపై ఫిర్యాదు

ధర్నా నిర్వహిస్తున్న బాధ్యత కుటుంబ సభ్యులను మరియు వివిధ పార్టీ నాయకులను కోస్గి సీఐ సైదులు ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది కాబట్టి ధర్నా నిర్మించుకోవాలని సూచించగా అదే సందర్భంలో పోలీస్ స్టేషన్ నందు ఎస్సై విజయ్ కుమార్ పై చర్య తీసుకోవాలని రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

సీఐ సైదులు వివరణ

కావాలి ఎల్లప్పను పోలీసులు కొట్టలేదని అలాగే మద్దూర్ పోలీస్ స్టేషన్ నుండి బాధితున్ని కోస్గి పోలీస్ స్టేషన్ కు ఎందుకు తీసుకువచ్చారనే అంశం పై మరియు ఇతర అంశాలపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టి జిల్లా స్థాయి అధికారులకు తెలియజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు వెంకటయ్య, సాయిలు,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సలీం, అధ్యక్షులు గోపాల్, మధుసూదన్ రెడ్డి,
నెల్లి రాములు, భూనీడు సాయిలు, మల్లేష్ యాదవ్,ఆయా గ్రామాల ప్రజలు రైతులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్!… మార్చి 28న సినిమా రిలీజ్?

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button