తెలంగాణ

నల్గొండ మణికంఠ కలర్ ల్యాబ్ హత్య కేసును చేదించిన పోలీసులు

క్రైమ్ మిర్రర్ ప్రతినిధి, నల్గొండ:- నల్లగొండ రామగిరి లోని మణికంఠ కలర్ ల్యాబ్ లో దారుణ హత్యకు గురైన సురేష్ మర్డర్ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసి, రెండు ద్విచక్ర వాహనాలు, ఒకటి మారుతి జెన్ కారు మరియు ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు.. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు… రిటైర్డ్ ఎక్సైజ్ సి‌ఐ మాతరి వెంకటయ్య తన కుమార్తె సంసారం నాశనం కావడానికి కారణం తన అల్లుడి యొక్క అన్న అయిన గద్దపాటి సురేష్ అనే వ్యక్తి కారణము అని అభిప్రాయం ఏర్పరుచుకున్న మృతుని యొక్క తమ్ముని మామ మరియు తమ్ముని భార్య గద్దపాటి ఉమా మహేశ్వరి మృతుడిని హత్య చేయించేందుకు గతములో నేవీ లో పని చేసి రిటైర్డ్ అయిన స్కౌట్ డిటెక్టివ్ ఏజెన్సీకి చెందిన చిక్కు కిరణ్ కుమార్ @ C.K.కుమార్ అనే వ్యక్తికి మరియు అతని తమ్ముడు ముషo జగదీష్ లకు సుపారి ఇచ్చిహత్య చేయించినారు అని తెలిపారు…

*నిందితుల వివరాలు:*

ఏ1- మాతరి వెంకటయ్య తండ్రి బుడ్డయ్య, వయస్సు 66 సంవత్సరములు, కులము SC(మాధిగ) వృత్తి. రిటైర్డ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ నివాసము కొత్తపేట, హైదరాబాద్,

ఏ2- చిక్కు కిరణ్ కుమార్ @ CK కుమార్ తండ్రి అంజయ్య, వయస్సు 44 సంవత్సరములు, కులము పద్మశాలి, వృత్తి. రిటైర్డ్ నేవీ ఎంప్లాయ్ ప్రస్తుతము స్కౌట్ డిటెక్టివ్ ఏజెన్సీ, కొత్తపేట, హైదరాబాద్, నివాసము బండ్లగూడ, నాగోల్, హైదరాబాద్,

ఏ3- ముషం జగదీష్ తండ్రి కర్ణాకర్, వయస్సు.39 సంవత్సరములు, కులము.పద్మశాలి, వృత్తి.టైల్స్ వర్క్ నివాసము ఈదులూరు గ్రామము, కట్టంగూరు మండలము,

ఏ4- గద్దపాటి ఉమామహేశ్వరి భర్త నరేశ్, వయస్సు.37 సంవత్సరములు, MBBS డాక్టర్, నివాసము కొత్తపేట, హైదరాబాద్,

*హత్యచేయుటకు గల కారణము:*

2017 లో ఏ1- మాతరి వెంకటయ్య తన కుమార్తె అగు ఏ4- గద్దపాటి ఉమా మహేశ్వరి ని నకిరేకల్ పట్టణానికి చెందిన గద్దపాటి నరేష్ అనే యువకుడితో 2017 లో వివాహం చేశాడు. కొన్నాళ్లవరకు సంసారం సజావుగా సాగినప్పటికీ, నరేష్ మరొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకొని తన భార్యను దూరంగా ఉంచడంతో ఆమెను శారీరకంగా మరియు మానసికంగా హింసకు గురి చేయడము వలన భార్యాభర్తల మధ్య వివాదాలు మొదలయ్యి కేసులు కోర్ట్ లలో నడుస్తున్నవి. ఈ విషయానికి కారణం గద్దపాటి నరేష్ యొక్క అన్నఅగు గద్దపాటి సురేష్ కారణం అని, అతను మరొక స్త్రీతో చాలా కాలము నుండి సాన్నిహిత్యంగా ఉంటూ తన భార్యకు ధూరంగా వుండేవాడు. అతడు తన తమ్ముడు నరేశ్ కూడ అక్రమ సంబంధము కొనసాగించుటకు ప్రోత్సహిస్తున్నాడని, అతడిని ఏ విధంగానైనా తుద ముట్టించినట్లయితే తన అల్లునికి బుద్ది వచ్చి తన కూతురుతో మంచిగా ఉంటాడన్న దురాలోచనతో పధకము ప్రకారము హైదరాబాదులోని కొత్తపేటకు చెందిన “ స్కౌట్ డిటెక్టివ్ ఏజెన్సీ” కి చెందిన ఏ2- చిక్కు కిరణ్ కుమార్‌ @ సికె కుమార్ ను సంప్రదించి అతని ద్వార నిఘా పెట్టించాడు. దర్యాప్తులో నరేష్ మరో మహిళతో సహజీవనం చేస్తూ ఒక పాపను కన్నాడని సమాచారం రాగా, ఈ తతంగానికి సురేషే ప్రోత్సాహకుడేనని నమ్మిన ఏ1- వెంకటయ్య మరియు అతని కూతురు ఏ4- ఉమా మహేశ్వరి ఇద్దరు బలంగా నిర్ణయించుకుని అతన్ని హత్య చేయించాలని నిర్ణయించారు. ఇట్టి విషయము లో ఇరువురూ ఏ2- కిరణ్ కుమార్ కు చెప్పగా అంధుకు తాను నేను గతములో నేవీ లో కమ్మునికేషన్ వింగ్ లో పని చేసినానని, ఆధారాలు ధోరక్కుండా హత్య ఏ విధంగా చేయాలో తనకు బాగా తెలుసునని తాను (15) లక్షలు రూపాయలు ఇస్తే హత్య చేస్తానని ఒప్పంధము కుదుర్చుకున్నాడు. అంధులో భాగంగా (2) లక్షల రూపాయలు అడ్వాన్స్ ముట్ట చెప్పినారు. తన పధకములో బాగంగా ఏ2- చిక్కు కిరణ్ కుమార్ ఒక నెల క్రితం తన బంధువు అయిన ఏ3- ముషం జగదీష్‌ను చేరదీసి అతనికి 3 లక్షలు పారితోషికంగా ఇస్తానని ఆశ చూపించి హత్యలో భాగస్వామిగా చేసుకున్నాడు. మరియు నెల రోజుల నుండి నల్లగొండ లో తిరుగుచూ గద్దపాటి సురేశ్ కదలికలపై హత్య గురించిరెక్కీనిర్వహించినాడు.

*హత్య ఎలా జరిగింది:*

ఈనెల 11న శుక్రవారం సాయంత్రం ఏ2- కిరణ్ కుమార్ హైదరాబాద్‌లో హత్యకు కావలసిన వస్తువులు (చాకులు, మాస్కులు, టోపీలు, గ్లౌస్ లు ) సిద్దం చేసుకుని కారులో బయలుదేరి నల్గొండకు వచ్చు మార్గ మధ్యములో చెరువుగట్టు సమీపములో అప్పటికే అక్కడికి వేచి చూస్తున్న ఏ3- జగదీష్‌తో కలిసిన తర్వాత, వారు ఇద్దరూ రాత్రి 10:20 గంటలకు నల్లగొండ రామగిరి సెంటర్ లో గల మణికంఠ లేజర్ కలర్ ల్యాబ్ వద్దకు చేరుకొని ముందుగా వేసుకున్న పథకములో బాగంగా మృతుడు గద్దపాటి సురేశ్ షాపు వెనుక అప్పటికే పెట్టి ఉంచిన ద్విచక్ర వాహనము తీసుకుని మృతుని షాపు వద్దకు వచ్చి తమకు ఫోటోలు ప్రింట్ కావాలని అడుగగా అతడు రాత్రి అయినధి. రేపు ఉదయము రమ్మని అనగా అర్జెంట్ గా కావాలని మాటల్లో పెట్టి మృతుడు పనిలో నిమగ్నము అయ్యి ఉండగా అధే ఆధునుగా బావించి అతనిపై కత్తులతో దాడి చేసి గొంతు కోసి, వీపు బాగములో మరియు కడుపులో విచక్షణా రహితంగా పొడిచి ధారుణంగా హత్య చేసినారు. హత్య అనంతరం వారు బైక్ పై చెరువుగట్టు కు వెళ్ళి రక్తం అంటిన బట్టలు, కత్తులు కారులో పెట్టుకొని ముసి వాగు సమీపములో చెట్ల పొదలలో విసిరి వేసి హైదరాబాదు పారిపోయినారు. పై నేరస్తులు ఏ1-ఏ4 లను ఈ రోజు అరెస్టు చేసి కోర్ట్ లో హాజరు పరచనున్నాము.

ఇట్టి కేసును నల్లగొండ డిఎస్పి కె. శివరాం రెడ్డి ఆద్వర్యములో నల్లగొండ 2 టౌన్ సీఐ ఎస్.రాఘవరావు, శాలిగౌరారం సీఐ కె.కొండల్ రెడ్డి మరియు నల్లగొండ 1 టౌన్ సీఐ ఏ.రాజశేకర్ రెడ్డి మరియు ఎస్ఐ లు వై.సైదులు, డి. సైదాబాబు, పి.విష్ణుమూర్తి మరియు బి. సాయి ప్రశాంత్ మరియు సిబ్బంది నాలుగు బృందాలుగా ఏర్పడి త్వరితగతిన ఛేదించినారు. వీరిని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అబినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button