పల్నాడు, క్రైమ్ మిర్రర్: దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామంలో ఇంచార్జ్ డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో ఐదుగురు సీఐలు, పదిమంది ఎస్సైలు, పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.గ్రామంలో అనుమానాస్పద ప్రాంతాలను తనిఖీ చేస్తూ ఇళ్లను, వాహనాలను పరిశీలించారు. తనిఖీల సమయంలో సరైన పత్రాలు లేని సుమారు 40 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అలాగే పలుగులు, గొడ్డళ్లు వంటి ప్రమాదకర ఆయుధాలను కూడా పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే ప్రమాదాలపై పోలీసులు అవగాహన కల్పించారు. డ్రగ్స్ వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, సమాజానికి కూడా తీవ్ర నష్టం కలిగిస్తుందని వివరించారు.
మాదక ద్రవ్యాల నివారణ కోసం గ్రామస్తులు సహకరించాలని పోలీసులు కోరగా, గ్రామస్థులు డ్రగ్స్కు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేశారు. గ్రామంలో శాంతి భద్రతలు కాపాడటం కోసం ఇలాంటి చర్యలు కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు. పోలీసుల అవగాహన కార్యక్రమాన్ని గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో దాచేపల్లి సిఐ భాస్కర్, ఎస్సైలు గామలపాడు గ్రామ పెద్దలు శంకర శెట్టి సుబ్బారావు సుంకర శ్రీనివాసరావు సాంబ తదితరులు పాల్గొన్నారు
