క్రైమ్జాతీయం

బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్న 11 మంది పై కేసులు నమోదు!… పెద్ద నటులే అందరూ?

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ చాలామంది అమాయక ప్రజలను ఆత్మహత్య చేసుకునేలా చేస్తున్న 11 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ స్పై కేసులు నమోదయ్యాయి. వీళ్ళందరూ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తులే. ఏదో ఒక టీవీ ప్రోగ్రాంలోనూ లేదా యూట్యూబ్లోనూ సామాన్య ప్రజల నుండి.. పెద్ద ఫ్యామిలీ ల వరకు కూడా అందరికీ సుపరిచితులే. వీళ్లేదో పెద్ద ఘనకార్యాలు చేసి… అదృష్టవంతులని చెప్పి మనందరం అనుకుంటాం. కానీ చివరికి వీళ్లే మన ప్రాణాలను తీసేస్తున్నారు. అవును మీరు విన్నది నిజమే.

రెండు తెలుగు రాష్ట్రాలలో 11 మంది సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు. దానికి కారణంగానే వీళ్ళందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీళ్ళలో ముఖ్యంగా వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల, విష్ణుప్రియ, సుప్రీత, రీతు చౌదరి, హర్ష సాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్, కిరణ్ గౌడ్, సన్నీ యాదవ్, అజయ్ వంటి ఎంతోమంది మనందరికీ తెలిసిన వారే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు. ఈ 11 మంది పేర్లు చెప్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారే ఉండరు. మనమేమో వాళ్ళని చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఉంటాం. కానీ వాళ్ళు చేసే డబ్బు కుంభకోణాలు… మామూలువి కావు. మనలాంటి అమాయక ప్రజలను బెట్టింగ్ యాప్స్ లలో పాల్గొనేలా చేసి చివరకు ఆత్మహత్యలు చేసుకునేలా వీళ్లు చేస్తున్నారు.

అయితే ఇలాంటి వాళ్లపై తాజాగా ప్రపంచయాత్రికుడు అయినటువంటి మన తెలుగు యూట్యూబ్ నా అన్వేషణ అనే వ్యక్తి ఐపీఎస్ సజ్జనార్ దృష్టికి ఈ బెట్టింగ్ యాప్ లోని ప్రమోట్ చేస్తూ చాలామంది యువతను నాశనం చేస్తున్నారని ప్రతి ఒక్కరికి అర్థం అయ్యేలా చెప్పుకొచ్చారు. దీంతో వెంటనే రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్న వ్యక్తులను వెంటనే కఠినంగా శిక్షించాలని విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ లిస్టులో ఉన్న 11 మంది కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరికీ తెలిసిన వ్యక్తులే. అంతలా కాలం కలిసి వచ్చి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వీళ్ళు ప్రజలకు ఉపయోగపడాల్సింది చేయాల్సింది పోయి… ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్నారని ప్రజలే వీలపై మండిపడుతున్నారు. అయితే పోలీసులు రంగంలోకి దిగగా వీళ్ళందరూ కూడా మళ్ళీ ప్రతి ఒక్కరికి క్షమాపణలు చెబుతున్నారు. ఇంకెప్పుడూ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం లాంటివి చేయమని వేడుకుంటున్నారు. మరి ఎంతోమంది ఈ బెట్టింగ్ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడైనా ఈ మరణాలు తగ్గుతాయా లేదా అనేది వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button