
క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో :-పట్టపగలు, నడి రోడ్డుపై దళిత యువకులపై పోలీసుల దాష్టికం తెనాలిలో కలకలం రేపుతోంది. ఏదైనా తప్పు జరిగితే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన పోలీస్ శాఖ, ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కినట్టు వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో, యువకులను రోడ్డుపై నిలబెట్టి కొడుతూ, “మేమిలా కొడతాం జాగ్రత్త” అంటూ హెచ్చరికలు చేస్తూ ప్రజల్లో భయం కలిగించేలా పోలీసుల ప్రవర్తన కనిపించింది. ఇది చట్టానికి విరుద్ధంగా ఉండటమే కాక, పోలీస్ అధికారుల భద్రత కంటే భయం పుట్టించే దుష్ప్రవర్తనగా సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల తరపున నిలిచే వారే లేరన్న అభిప్రాయం ప్రజల్లో పెరిగిపోతోందని, ఇది వ్యవస్థలపైనా విశ్వాసాన్ని దెబ్బతీసే పరిస్థితికి దారితీస్తోందని మానవహక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ఎదుట మత్స్యకారుల ధర్నా!..