క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- భారతదేశంలోని హిందువులు అతిపెద్ద పండుగ గా జరుపుకునే మహా కుంభమేళాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాజాగా అడుగు మోపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద నరేంద్ర మోడీ అమృత స్నానం ఆచరించారు. హెలికాప్టర్లో మహాకుంభమేళా ప్రాంగణానికి చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘన స్వాగతం పలికారు. ఇక ఆ తరువాత మోదీ మరియు యోగి కలిసి అరియల్ ఘాట్ నుంచి పడవలో గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం వద్దకు వెళ్లారు. అక్కడ ఎంతోమంది సాధువులు, గురువులతో మంత్రోచ్చారణాల నడుమ పుణ్య స్నానాలను ఆచరించారు.
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత.. కొట్టుకున్న బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లు!!
కాగా ఈ మహాకుంభమేళాలో దాదాపుగా ప్రపంచ నలుమూలల నుండి కొన్ని కోట్ల మంది భక్తులు తరలివచ్చి పుణ్య స్నానాలను ఆచరిస్తున్నారు. దాదాపుగా 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే హిందువుల అతిపెద్ద పండుగ కాబట్టి చాలామంది భక్తులు తరలివస్తున్నారు. ఈ మహా కుంభమేళా ప్రారంభమై దాదాపుగా 20 రోజులు అవుతున్న ఇప్పటికే 25 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నాలను ఆచరించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ మహా కుంభమేళాకు 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేగా ఆసంఖ్య దాటేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాగా ఫిబ్రవరి 26వ తారీఖున ఈ మహా కుంభమేళా ముగుస్తుంది.
రాష్ట్రంలో ఎమ్మెల్సీ కిడ్నాప్!… టిడిపి నేతలే చేశారని ఆరోపిస్తున్న వైసిపి?